కాశీపురాధీశా!!!

క్రితం సారి మనం కలుసుకున్నప్పుడు నిన్ను అడిగా కదా.. కానీ, నీ సన్నిధిలో 9 రోజులు గడపాలి అన్న సంకల్పాన్ని ఇంత త్వరగా నెరవేరుస్తావని అనుకోలేదయ్యా!! నేను ఎలా ఊహించుకున్నానో, అలాగే రోజులు గడిచిపోయాయి. చెప్పలేని ఆనందం, అంతులేని తృప్తి ఇచ్చావు. ఈ జన్మంతా నెమరువేసుకోడానికి సరిపడా తీపి జ్ఞాపకాలు పెట్టెలో సర్దుకుని తిరుగు ప్రయాణమయ్యామయ్యాం !!! రోజూ గంగలో స్నానం, నీ దివ్య దర్శనం, భోజనం, మళ్ళీ దర్శనం, వీలైతే ఇంకో దర్శనం - ఇలా గడిచిన పరమ పావనమైన రోజులవి. ఎన్ని సార్లు తలుచుకున్నా తనివితీరడం లేదయ్యా, శివయ్యా... తొలిసారి నిన్ను స్పృశించిన అనుభూతి వర్ణనాతీతం. మళ్ళీ మళ్ళీ నిన్ను తాకి పరవశించిన ఈ చేతులను ఎన్ని సార్లు ముచ్చటగా చూసుకున్నానో నీకు తెలుసుగా... కేదార్ ఘాట్ లో ఒక మధుర స్మృతి Places visited: 12th May - 22nd May విశ్వనాధుడు, అన్నపూర్ణమ్మ కాశీ విశాలాక్షి 18th May వారాహీ దేవి తిలభాండేశ్వరుడు కాలభైరవుడు బిర్లా టెంపుల్ సార్ నాధ్ సంకట మోచన్ హనుమాన్ దుర్గా మాత ఆలయం తులసీ మానస మందిరం త్రిదేవ్ ఆలయం గవ్వలమ్మ మందిరం చింతామణి గణపతి స...