కదిరి - లేపాక్షి
బెంగుళూరు నుంచి దగ్గరలో ఉన్న అద్భుత క్షేత్రాలలో ఒకటైన "శ్రీమత్ ఖాద్రి నరసింహ స్వామి" దగ్గరకి ఇన్నాళ్లకు పిలుపు వచ్చింది. గూగుల్ సహాయంతో - త్రోవలో ఉన్న ఇంకొన్ని క్షేత్రాల దర్శనాలు చేసుకుంటూ రెండు రోజులని ఆనందంగా గడిపేసాం. ఎంతో విలువైన జ్ఞాపకాలతో తిరిగివచ్చాం. అసలు ఆరంభమే అద్భుతం - వేణుగోపాల స్వామికి జరిగిన అభిషేకాలు, సేవలు - కనుల విందుగా చూసాం. నంది హిల్స్ పైన ఉన్న యోగ నందీశ్వర స్వామి ఆలయం చాలా బాగుంది. రమణీయమైన ప్రకృతిని చాలాసేపు ఆస్వాదించి, కొండదిగి భోగ నందీశ్వరాలయానికి చేరుకున్నాం. మాటలకందని అనుభూతితో అక్కడ నుంచి రంగనాథ స్వామిని చూడటానికి వెళ్లాం. తలుపులు వేసి ఉన్నాయని అనుకుంటూ ఉండగానే, "వెళ్లి, తలుపులు తీసుకొని దర్శనం చేసుకోండి" అన్న మాటలు వినబడ్డాయి. ఇంకేం కావాలి ? మనసు పరవశంతో పరవళ్లు తొక్కింది. చక్కగా స్వామి సన్నిధి లో కాసేపు గడిపి వచ్చాం. తరువాత జాలరి నరసింహ స్వామి, స్వయం వ్యక్తమై వేంచేసిన క్షేత్రాన్ని దర్శించి కదిరి చేరుకున్నాం. శ్రీమత్ ఖాద్రి నారసింహ స్వామి వారి దర్శనం...