రుద్ర నమకచమకములు - భావము - part3
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్మృక్షీయమామృతాత్ యో రుద్రో అగ్నౌ యో అప్సుయ ఓషధీషు యో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. కాల స్వరూపుఁడు, అఖండ ఆనంద స్వరూపుఁడు ఐన ఆ పరమాత్మతో యోగము ద్వారా మన దేహము పవిత్రమగును గాక.పండిన దోస పండు తనంతట తానే తొడిమ నుండి వేరు పడినట్లు మనమూ మృత్యువు నుండి వేరు పడి అమృతత్వమును పొందుదుము గాక. అగ్ని, నీరు మున్నగు వానియందును, ఓషధులు విశ్వమున భువనములందును ఏ రుద్రుఁడు లీనమై యుండెనో అట్టి రుద్రునకు నమస్కారము అగును గాక. " తముష్టుహి యస్స్విషుసు ధన్వాయో విశ్వస్య క్షయతి భేషజస్య యక్ష్వా మహే సౌ మనసాయ రుద్రం న మో భిర్దేవ మసురందువస్వ. ఉత్తమమైన అస్త్ర శస్త్రములు కలిగి, వైద్యుడై మన రోగాలను నిర్మూలించే,రాక్షసులను సంహరించే రుద్రునికి మన మనస్సులను పవిత్రం చేస్తున్నందుకు నమస్కారములు. అయంమే హస్తో భగవానయంమే భగవత్తర: అయంమే విశ్వభేషజోయం శివాభిమ ర్శన: శివుని తాకి, పూజించే ఈ హస్తము మాకు దేవునితో సమానము. శివుని తాకినఈ హస్తము నా సర్వ రోగములకు దివ్యౌషధము. యేతే సహస్ర మయుతం పాశా మృత్యోమర్త్యాయ హంతవే తా...