శ్రీశైల మహాక్షేత్రం
# శ్రీశైల _చరిత్ర శ్రీశైల మహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా, ఆత్మకూరు తాలుకా లోనున్న నల్లమల అడవులలోని పర్వత శ్రేణుల నడుమ పాతాళగంగ పేరుతో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణా నదికి కుడివైపున ఉంది. ఈ క్షేత్రం సముద్రమట్టానికి 476 మీటర్లు సుమారుగా 1500 అడుగులు . # శ్రీశైల_మహిమ 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి కి పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబికాదేవికి, నిలయమైన ఈ మహాక్షేత్రం వేదములకు ఆలవాలమై, సకల సంపదలకు పుట్టినిల్లై , 8 శృంగాంగాలతో, 44 నదులతో దీర్ఘ తీర్థరాజాలతో, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవనాలతో, చంద్ర గుండ, సూర్య గండాది పుష్కరిణులతో స్పర్శవేదులయిన లతలు, చెట్లు మరియు లింగాలతో అనంతమైన ఔషధులతో విరాజిల్లుతూ యాత్రికుల మనసులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. # క్షేత్ర_ప్రాముఖ్యం . సకల లోకారాధ్యం అయిన శ్రీశైల మహాక్షేత్రం, భూమండలానికి నాభిస్థానమని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా సంకల్పంలో శ్రీశైలాన్ని స్మరిస్తూ _ శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, శ్రీశైల ఉత్తదిగ్భాగే అని, తాము శ్రీశైల క్షేత్రానికి ఏ ...