నాలుగు యుగాలు
వేదాల ననుసరించి యుగాలు నాలుగు : అవి : 1) సత్యయుగము 2) త్రేతాయుగము 3) ద్వాపరయుగము 4) కలియుగము. 1) సత్యయుగము : నాలుగు యుగాలలో సత్య యుగము మొదటిది. ఈ సత్యయుగానికే కృతయుగమని పేరు. ఈ యుగమునందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. అకాలమరణాలుండవు. ఈ యుగము వైవశ్వత మన్వంతరములో సత్యయుగము కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమయినది. 2) # త్రేతాయుగము :- రెండవ యుగ ము త్రేతా యుగము. ఈ యుగములో భగవంతుడు శ్రీ రామ చంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగము పరిమితి 4,32,000 * 3 = 12,96,000 అనగా పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఇందు ధర్మము మూడు పాదములపై నడుస్తుంది. ఈ యుగము వైశాఖ శుద్ధ తదియ రోజునుండి త్రేతాయుగము ప్రారంభమైనది. 3) # ద్వాపరయుగము :- మూడవు యుగమే ద్వాపర యుగము అని అంటారు, ఈ యుగమున భగవంతుడు శ్రీ కృష్ణుడుగా అవతరించారు. ద...