ఏకాదశ రుద్రులు - కోనసీమ
సంక్రాంతిలో మూడవ రోజైన కనుమ పండుగలో ప్రముఖమైన ప్రభల తీర్ధంగురించి క్లుప్తంగా...... హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారము ఏకాదశ రుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం మొత్తం మీదా,ఈ భూమండలం మొత్తానికీ ఒకేఒక్క చోటు, అదీ వేదసీమ అయినటు వంటి కోనసీమలోనే. 400 ఏళ్ళ పైబడి చరిత్ర కలిగి, కోనసీమ అందాలు ఇంద్రదనసుల్లా కొలువు తీరే ప్రభల తీర్ధం కన్నుల పండుగలా కనుమనాడు జరుగుతుంది. కోనసీమ లో 84 చోట్ల జరిగే ఈ ప్రభల తీర్ధాల్లో జగ్గన్నతోట , వాకలగరువు ,కొర్లగుంట ప్రసిద్ధి గాంచినవి. కొత్తపేట పరిసర గ్రామాల ప్రభలతీర్ధం నేడే అంటే సంక్రాంతి పెద్ద పండుగ రోజునే కొత్తపేటలో ఘనంగా జరుపుతారు భక్తి శ్రర్ధలతో తీర్చిదిద్దిన ప్రభలను తీర్ధాలు జరిగే ప్రాంతాలకు తరలించేందుకు పురాతనంగా ఉన్న రహ దారులను వాడతారు మార్గమధ్యలో పంట కాల్వలు ఉన్నా వరి చేలు ఉన్నాఛేదించి వెళ్ళటమే వీటి ప్రత్యేకత ఇవి కనులారా వీక్షించేందుకు అధిక సంఖ్యలో స్థానికులతోపాటు విదేశాలలో స్థిరపడిన కోనసీమ వారు ప్రభల ఉత్సవాలకు వస్తుంటారు మారుతున్న కాలంలో నాటికీ నేటికి సాంస్కృతిక సంప్రదాయాలకు ఆదరణ తగ్గలేదనటానికి ఈ ప్రభల ఉత్సవాలే ఉదాహరణ .. కోనసీమ నడుమ తరతరాలనుండీ జరుగ...