Posts

Showing posts with the label kasi

వారణాసి విశేషాలు

విశ్వేశ్వర జ్యోతిర్లింగం, వారణాసి మహాప్రళయ కాలంలో అవిముక్త నగరం, ఆదిదంపతులకు ఆనందకాననం, మర్త్యలోకంలో మహాశివుడు నివసించే మహాస్మశానం, విశ్వేశ్వరలింగం జ్యోతిర్లింగంగా వెలసి, స్వయంగా శివుడే నిర్మించాడని చెప్పే వారణాసి. కాశ్యాంతు మరణాన్ ముక్తిః – కాశీ పట్టణంలో మరణించడమే మోక్షదాయకం. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలం మీద నిలబెట్టాడని చెప్పే నగరం కాశీ. దీనికి బిందుమాధవ క్షేత్రం అనే పేరు కూడా ఉంది. ఋగ్వేదంలో ఈ పట్టణాన్ని జ్యోతిస్థానం అని వర్ణించారు. జ్యోతిర్లింగంగా, శక్తిపీఠంగా, ముక్తినగరంగా వినుతికెక్కిన కాశీ (వారణాశి) స్మరణ మాత్రం చేతనే సప్తజన్మల పాపాలనూ పోగొట్టగల మహిమ కలది. వాసం చేతనే వాసనా బలాన్ని జయించగల శక్తిని ప్రసాదించే వారణాసి, సురనది అయిన గంగానదీ తీరాన ఉన్న పుణ్యనగరం. విశ్వేశ్వర జ్యోతిర్లింగ స్తోత్రం:  సానంద మానందవనే వసంత మానందకందం హతపాపబృందమ్ వారాణసీనాథ మనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే || స్థలపురాణం :- శివ పురాణం ప్రకారం – సృష్టి నిమిత్తం పరమేశ్వరుడు ప్రకృతి, పురుషులను సృష్టించి, వారిని తపస్సు చేయమని ఆదేశించాడు. అపుడు వారు తపమునకు తగిన ప్రదేశము ఏది అని అడుగగా, ఐద...

కాశీకి పోయాను రామా హరీ !!!

Image
కాశీకి పోయాను రామా హరీ !!! గంగలో.. మునిగాను ముమ్మారు రామా హరీ !!! కాశీకి పోయాను రామా హరీ !!! శివుని కళ్ళార చూసాను రామా హరీ !!! నువ్వు కరుణిస్తే, ఇలాగే ఉంటుంది.  అంతా శివ మయంగానే అగుపిస్తుంది, శివదర్శనంతో కళ్ళు తరించిపోతాయి, శివ స్పర్శతో చేతులు పరవశించిపోతాయి. శివనామస్మరణతో మనసు ఉప్పొంగిపోతుంది . ఆరంభమే అద్భుతం, భువనేశ్వర్ లో ఆహా అనిపించే నీ అందమైన స్వరూపం, లింగరాజ్ రూపంలో ప్రత్యక్షం. హరిహరులు ఒకే పంచన కలిసి కనిపించి కనులవిందు చేసారు. గంగమ్మ మనిషికే కాదు, మనసుకున్న మలినాలని కూడా కడిగెస్తుందిగా!!! అలా మమ్ము పరమ పునీతులని చేసింది, నీ సన్నిధికి రాగానే. ముమ్మారు హరనామస్మరణ చేస్తూ మునిగిన మూడు మునకలతో మూడు జన్మల పాపం హరించుకుపోయి, మూడింతల శక్తి వచ్చింది. నా చిరకాల వాంఛని ఇన్నాళ్ళకి ఈడేర్చావా హరా!!! నీ సన్నిధిలో ఎంతసేపు ఉన్నా తనివితీరదు కదా!!! ఏమిటి నీ ఈ మాయ, మహేశా!!! మళ్ళీ మళ్ళీ ఎన్నెెన్ని సార్లు కాశీపురం తీసుకువచ్చి నా తనివి తీరుస్తావో చూస్తా, యెదురు చూస్తా !!! నీ దివ్యమంగళ దర్శన భాగ్యంతో పాటు, అమ్మని చూశాము, అన్నపూర్ణమ్మ పెట్టిన అన్నం తిన్నాము. విశాలాక్షి అ...