కాశీకి పోయాను రామా హరీ !!!

కాశీకి పోయాను రామా హరీ !!!
గంగలో.. మునిగాను ముమ్మారు రామా హరీ !!!
కాశీకి పోయాను రామా హరీ !!!
శివుని కళ్ళార చూసాను రామా హరీ !!!

నువ్వు కరుణిస్తే, ఇలాగే ఉంటుంది.  అంతా శివ మయంగానే అగుపిస్తుంది, శివదర్శనంతో కళ్ళు తరించిపోతాయి, శివ స్పర్శతో చేతులు పరవశించిపోతాయి. శివనామస్మరణతో మనసు ఉప్పొంగిపోతుంది .

ఆరంభమే అద్భుతం, భువనేశ్వర్ లో ఆహా అనిపించే నీ అందమైన స్వరూపం, లింగరాజ్ రూపంలో ప్రత్యక్షం. హరిహరులు ఒకే పంచన కలిసి కనిపించి కనులవిందు చేసారు.

గంగమ్మ మనిషికే కాదు, మనసుకున్న మలినాలని కూడా కడిగెస్తుందిగా!!! అలా మమ్ము పరమ పునీతులని చేసింది, నీ సన్నిధికి రాగానే. ముమ్మారు హరనామస్మరణ చేస్తూ మునిగిన మూడు మునకలతో మూడు జన్మల పాపం హరించుకుపోయి, మూడింతల శక్తి వచ్చింది.

నా చిరకాల వాంఛని ఇన్నాళ్ళకి ఈడేర్చావా హరా!!! నీ సన్నిధిలో ఎంతసేపు ఉన్నా తనివితీరదు కదా!!! ఏమిటి నీ ఈ మాయ, మహేశా!!! మళ్ళీ మళ్ళీ ఎన్నెెన్ని సార్లు కాశీపురం తీసుకువచ్చి నా తనివి తీరుస్తావో చూస్తా, యెదురు చూస్తా !!!

నీ దివ్యమంగళ దర్శన భాగ్యంతో పాటు, అమ్మని చూశాము, అన్నపూర్ణమ్మ పెట్టిన అన్నం తిన్నాము. విశాలాక్షి అమ్మవారిని కళ్ళారా చూసాకా, కాలభైరవుడిని దర్శించి తరించాం. గంగమ్మ హారతి కోసం ఎదురు చూసిన మాకు కళ్ళ ముందు అద్భుతం ఆవిష్కృతమైంది. తిరుగులేని తృప్తితో  తిరుగుప్రయాణమయ్యాం.

గంగమ్మ ఒడిలో, ఇదిగో ఇలా అల్లరి చేసాం...


Places visited:
Lingaraj temple, Bhubaneswar - 25th Sep 10AM
Ganga  Snanam, Kedarghat - 26th Sep 11AM
Kedareswar, Kedarghat - 26th Sep 12PM
Kasi Viswanath, Varanasi - 26th Sep 1PM
Maata Annapurna, Varanasi - 26th Sep 2PM
Kasi Visalakshi, Varanasi - 26th Sep 2:30 PM
Kalabhairav, Varanasi - 26th Sep 3:30PM
Ganga Haarathi, DasaAswametha ghat- 26th Sep 7PM

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం