కదిరి - లేపాక్షి

బెంగుళూరు నుంచి దగ్గరలో ఉన్న అద్భుత క్షేత్రాలలో ఒకటైన "శ్రీమత్ ఖాద్రి నరసింహ స్వామి" దగ్గరకి ఇన్నాళ్లకు పిలుపు వచ్చింది.   గూగుల్ సహాయంతో - త్రోవలో ఉన్న ఇంకొన్ని క్షేత్రాల దర్శనాలు చేసుకుంటూ రెండు రోజులని ఆనందంగా గడిపేసాం. ఎంతో విలువైన జ్ఞాపకాలతో తిరిగివచ్చాం.

అసలు ఆరంభమే అద్భుతం - వేణుగోపాల స్వామికి జరిగిన అభిషేకాలు, సేవలు - కనుల విందుగా చూసాం.  నంది హిల్స్ పైన ఉన్న యోగ నందీశ్వర స్వామి ఆలయం చాలా బాగుంది.  రమణీయమైన ప్రకృతిని చాలాసేపు  ఆస్వాదించి, కొండదిగి భోగ నందీశ్వరాలయానికి చేరుకున్నాం.  మాటలకందని అనుభూతితో అక్కడ నుంచి  రంగనాథ స్వామిని చూడటానికి వెళ్లాం.  తలుపులు వేసి ఉన్నాయని అనుకుంటూ ఉండగానే, "వెళ్లి, తలుపులు తీసుకొని దర్శనం చేసుకోండి" అన్న మాటలు వినబడ్డాయి.  ఇంకేం కావాలి ?  మనసు పరవశంతో పరవళ్లు తొక్కింది. చక్కగా స్వామి సన్నిధి లో కాసేపు గడిపి వచ్చాం.  తరువాత జాలరి నరసింహ స్వామి, స్వయం వ్యక్తమై వేంచేసిన క్షేత్రాన్ని దర్శించి  కదిరి చేరుకున్నాం.  శ్రీమత్ ఖాద్రి నారసింహ స్వామి వారి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం.   ఎంతమంది భక్తులు ఉన్నా కూడా, కాసేపు స్వామి వారి సన్నిధిలో ప్రశాంతంగా గడపగలగడం, మా అదృష్టం.   అక్కడినుంచి, లేపాక్షి చేరుకొనేసరికి పొద్దుపోయింది, ముందుగానే book చేసుకున్న హరిత హోటల్ లో ఆదమరిచి నిద్రపోయాం.

మర్నాడు ఉదయాన్నే, 6:30కి, వీరభద్రస్వామి ఆలయానికి చేరుకున్నాం.  శివభక్తులు, జీవితంలో కనీసం ఒకసారైనా వెళ్లి తీరాల్సిన ఆలయం ఇది.  మాటల్లో, పదాల్లో, వర్ణించనలవికాని అద్భుతం కళ్ళముందు ఆవిష్కృతమైంది.  ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలు,  శిల్ప సౌందర్యం, పాపహరేశ్వర స్వామి వారు, అమ్మవారు, వీరభద్రుడు - అన్ని దర్శనాలూ మనల్ని కట్టిపడేస్తాయి.  అక్కడనుంచి పక్కనే ఉన్న, లేపాక్షి నంది ని కళ్లారా చూసాం.  చిన్నప్పటినుంచి, లేపాక్షి పుస్తకాలమీద చూసిన నందిని నిజంగా చూసి చాలా సరదావేసింది.  "నందీశ్వర నమస్తుభ్యం, సాంబానంద ప్రదాయకా !  మహాదేవస్య సేవార్ధం అనుజ్ఞామ్ దాతుమర్హసి" అని ఆయన్ని వేడుకొని, ప్రయాణం మొదలుపెట్టాం.   కదిరి నరసింహ ఆలయం ఇంకొకటి కర్ణాటక సరిహద్దుల్లో ఉంది.  ఎంతో ప్రాచీనమైన ఆ ఆయలం ఈ మధ్యనే, పునర్నిర్మించబడింది.  ఆయన చక్కటి దర్శనం ప్రసాదించారు.  అక్కడినుంచి విదురాశ్వత చేరుకొని అశ్వత్థ వృక్షంలో వెలసిన సుబ్రహ్మణ్యుడిని దర్శించుకొని అత్యంత మహిమాన్వితమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటైన "ఘాటీ సుబ్రహ్మణ్య" చేరుకున్నాం.  ఒకే శిలలో, ముందువైపు సుబ్రహ్మణ్యస్వామి, వెనుకవైపు నృసింహ స్వామి ఉన్నారు - "శివకేశవులకు బేధం లేదు సుమా" అని చెప్పినట్లు ఉన్న ఆ ఆలయాన్ని ఆనందంగా తిలకించాము.  అక్కడినుంచి కొద్దిదూరంలో ఇటీవల ప్రతిష్టించబడిన 30 అడుగుల శనీశ్వరస్వామి నిలువెత్తు విగ్రహాన్ని చూసి అచ్చెరువొందాం.  ఈ జ్ఞాపకాలు పదిలంగా దాచుకొని ఇంటికి తిరిగివచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది.  అప్పుడు గుర్తుకొచ్చింది అందరికీ, భోజనం చెయ్యలేదని - నా ధర్మపత్ని వేడి వేడిగా వండితే, నేను, పిల్లలు కలిసి తిని పెట్టాం.

వీరభద్ర స్వామి ఆలయంలో ఒక జ్ఞాపకం...


Temples visited:
Day1
Sri Venugopala Swamy Temple, Devanahalli Fort - 11AM
Chandramouleshwara swami temple, Devanahalli Fort - 11:30AM

Yoga Nandeeshwara Temple - 1PM
Bhoga Nandeeshwara Temple - 3PM
Sri Ranganatha Swamy Temple, Rangasthala - 4 PM
Sri Jalari Lakshmi Narasimha Swamy Temple - 5 PM

Sreemath Khadri Lakshmi Narasimha Swamy Vari Devasthanam - 7:30PM

Lepakshi - night stay

Day2
Veerabhadra Temple, Lepakshi - 7AM
Lepakshi Nandi - 8 PM
Kadiri Narasimha temple - 9 PM

Vidurashwatha Temple, Gowribidanur - 10AM

Ghati Subramanya, Doddaballapur - 11AM
Saneeswara Temple, Hulukadi Betta, Doddaballapur - 12 Noon

Google maps link for Day1 - https://maps.app.goo.gl/i/vgDXL
Google maps link for Day2 - https://maps.app.goo.gl/i/r6z2s
Note: Open the link on your phone and change the 1st location as your home.

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం