దసరా నవరాత్రులు
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
ప్రతి ప్రాణిలోనూ ఆ జగన్మాత ఇచ్ఛాశక్తిగా, భౌతిక శక్తిగా, జ్ఞానశక్తిగా, క్రియాశక్తిగా లోపల దాగి ఉంటుంది. ఆ కారణంగానే ప్రతిప్రాణీ తన బుద్ధితో ఓ పనిని చేయాలని సంకల్పించి, దానికి తన భౌతిక శక్తిని వినియోగించి, జ్ఞానశక్తిగా మార్చుకుంటుంది. ఆ జ్ఞానశక్తినే క్రియాశక్తి రూపంలో ఆచరించగలుగుతున్నది. సృష్టిలోని సకలచరాచరాల్లో శక్తి రూపంలో దాగి ఉన్న ఆ తల్లికి వేలవేల నమస్కారాలు. సృష్టిలోని సకల జీవులు ఆ అమ్మనే ఆశ్రయిస్తాయి. కనుకనే ఆమె అమ్మలగన్న అమ్మ అయింది.
శ్రీదేవి లీలా విగ్రహ స్వరూప మహాత్మ్యం అనిర్వచనీయం. వర్ణించడం ఎవరి తరమూ కాదు. ఆదిపరాశక్తి.. అమ్మలగన్న అమ్మ.. శరణన్న వారిని రక్షించి అభయమిచ్చే లోకపావని ఆ జగన్మాత. లోకకల్యాణార్థం రాక్షస సంహారం గావించింది. ఒక్కొక్క రోజు ఒక్కో రూపం ధరించి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది మంది రాక్షసు లను సంహరించింది. ఆమె సాధించిన విజయా నికి గుర్తుగా తొమ్మిది రోజులపాటు నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. శర దృతువులో వస్తాయి కాబట్టి వీటిని శరన్నవ రాత్రులు అంటారు. ఈ దేవీ నవరాత్రులు అమ్మ వారి అనుగ్రహసాధనకు చాలా విశిష్టమైన రోజులు.
శక్తి స్వరూపమంటే?
సకల జీవులనూ సృష్టించే ఆ బ్రహ్మలో సగ భాగం సరస్వతీదేవి. విష్ణుపత్ని లక్ష్మి. శివుని అర్థాంగి పార్వతి. ఈ ముగ్గురూ కలిసిన స్వరూపమే త్రిశక్తి స్వరూపం అంటారు. ఈ మువ్వురు దేవతామూర్తులు ఒక్కచోటజేరిన త్రిశక్తి ఆల యానికి విశేష ప్రాముఖ్యం ఉంది. బ్రహ్మని వీడి సరస్వతి ఉండదు, శ్రీమహా విష్ణువు వక్షస్థల ఆవాసం లక్ష్మీదేవి వీడదు. ఇక శంకరుడంటే అర్థనారీశ్వరుడేకదా! అతడిలో సగ భాగం పార్వతీదేవి. దీన్నిబట్టి తెలిసేదేమిటంటే, భార్యాభర్తల అన్యోన్యతకు చిహ్నమే శక్తిస్వరూపం. వారి ఐకమత్యరూపమే శక్తిస్వరూపమన్నమాట.

తొమ్మిది రోజులే ఎందుకు?
దేవి అంటే ఎవరో కాదు. శక్తి స్వరూపిణి. లోక మాత. సామాన్యభాషలో అర్థం వివరించి చెప్పా లంటే స్ర్తీకి ప్రాతినిధ్య రూపమే ఆ మహాశక్తి. ఒక స్ర్తీ తాను గర్భవతిగా ఉన్న తొమ్మిది నెలల కాలంలో అనేక వ్యాధులు, బాధలు, మాన సిక భయాలను ఎలా భరించి పదవ నెలలో పండంటి బిడ్డని కని విజయాన్ని సాధిస్తుందో అదే తీరుగా అమ్మవారు కూడా రాక్షసులతో తొమ్మిది రోజులు పోరాడి పదవ రోజు విజయం సాధించింది. ఆ రోజునే విజయదశమి అని పండిత భాష్యం. అందుకే అమ్మవారి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. పదవరోజు ముగింపు ఉత్సవం.

ప్రథమా శైలపుత్రీచ ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయా చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థికీ
పంచమా స్కందమాతేతి షష్ఠా కాత్యాయనేతిచ
సప్తమా కాళరాత్రీచ అష్టమాచేతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత నవదుర్గా ప్రకీర్తితా

నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మ వారిని పూజించాలి. ప్రాంతీయ ఆచారాలను బట్టి నవరాత్రులలో దేవీ అలంకారాలు చేస్తారు. కొన్ని చోట్ల శైలపుత్రీ, బ్రహ్మచారిణీ, చంద్రఘంటా, కూష్మాండా, స్కంధమాత, కాత్యాయనీ, కాళరాత్రీ, భైరవీ, సిద్ధిధాత్రీ రూపాలలో పూజిస్తే, బాలా త్రిపురసుందరి, గాయత్రీ, అన్నపూర్ణా, లలితా త్రిపుర సుందరి, శ్రీమహాలక్ష్మీ, సరస్వతీ, దుర్గా, మహిషాసుర మర్దిని, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా మరికొన్ని చోట్ల అమ్మవారికి అలంకారాలుచేసి పూజలు నిర్వహిస్తారు.
శరన్నవరాత్రుల విశిష్టత
అమ్మవారికి సంవత్సరంలో నాలుగుసార్లు నవ రాత్రులు నిర్వహిస్తారు. అవి వసంత నవ రాత్రులు, ఆషాఢ నవరాత్రులు, ఆశ్వయుజ నవ రాత్రులు, మాఘ నవరాత్రులు. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగేవి వసంత నవ రాత్రులు, ఆషాఢ శుక్లపక్షంలో జరిపే నవ రాత్రులు ఆషాఢ నవరాత్రులు, వీటినే శాకంభరీ నవరాత్రులు అంటారు. ఆశ్వయుజ నవరాత్రులు శరదృతువులో వస్తాయి. వీటిని శరన్నవరాత్రులు అంటారు. మాఘమాసాన శుక్లపక్షాన జరిపే నవరాత్రులను మాఘనవరాత్రులు లేక గుప్త నవరాత్రులు అంటారు. మిగిలిన మూడు నవ రాత్రులను దేశమంతటా నిర్వహించకపోయినా దసరా నవరాత్రులను మాత్రం అంతటా జరుపు తారు కాబట్టే ఈ నవరాత్రులకు అంత ప్రాముఖ్యం ఏర్పడింది.

కుమారీ పూజ
శరన్నవరాత్రులలో దేవీపూజతోపాటు కొన్ని చోట్ల కుమారీపూజ కూడా నిర్వహిస్తారు. ఈ కుమారీ పూజ గురించి దేవీభాగవతంలో చెప్ప బడింది. కుమారీ పూజలో రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసున్న బాలికలను ఆ జగన్మాత ప్రతిరూపంగా పరిగణించి పూజిస్తారు. వారిని వస్ర్తాదులతో సత్కరిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కో వయసున్న బాలికకు పూజలు చేస్తారు. రెండు సంవత్సరాల వయసున్న బాలికను కుమారీ అంటారు. కుమా రీని పూజించడంవల్ల దారిద్య్ర దుఃఖాలు నశిస్తాయి. మూడు సంవత్సరాల వయసున్న బాలికను త్రిమూర్తి అంటారు. ఈమెను పూజిం చడం వల్ల ధనధాన్య, పుత్రపౌత్రాభివృద్ధి జరుగు తుంది. నాలుగు సంవత్సరాల వయసున్న బాలి కను కల్యాణి అంటారు. కల్యాణిని పూజించడం వల్ల రాజ్యాభివృద్ధి, విద్యాభివృద్ధి కలుగుతుంది. ఐదేళ్ల వయసుగల బాలికను రోహిణి అంటారు. రోహిణిని పూజించడం వల్ల ఆరోగ్యం చేకూరు తుంది. ఆరు సంవత్సరాలున్న బాలికను కాళిక అంటారు. ఈమెను పూజిస్తే శత్రునాశనం జరుగు తుంది. ఏడు సంవత్సరాల వయసున్న బాలికను చండిక అంటారు. ఈ పూజ ఐశ్వర్యాన్నిస్తుంది. ఎని మిది సంవత్సరాల వయసున్న బాలికను శాంభవి అని పిలుస్తారు. ఈ పూజవల్ల అధి కారులు మనకు అనుగుణంగా ఉంటారు. తొమ్మిది సంవత్సరాల వయసున్న బాలికను దుర్గ అంటారు. ఈమెను పూజిస్తే సర్వసుఖాలు లభి స్తాయి. పదిసంవత్సరాల వయసు గల బాలికను సుభద్ర అంటారు. ఈపూజ వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి.

విజయాలు చేకూర్చే విజయదశమి
దసరానే విజయదశమి అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ శుక్ల దశమినాటి సంధ్యా కాలాన్నే విజయకాలం అంటాం. అది సర్వ కార్యసాధక సమయం. ఆ దశమీ దినాన శ్రవణా నక్షత్రం కలిసి ఉండాలన్నది పెద్దల నిర్ణయం. ఈ విజయదశమి పుణ్యదినాన ప్రజలంతా చేరి ఊరి ఈశాన్య దిశలో శమీవృక్ష ప్రదేశానికి చేరుకుంటారు.
శమీ శమీయతే పాపం శమీశతృ వినాశనం
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శనీ
అంటే శమీవృక్షము పాపాన్ని పరిహ రిస్తుంది. శత్రువులను నాశనం చేస్తుందని అర్థం. ఇది నాడు అర్జునుని ధనువును కాపాడింది. శ్రీరాముడికి ప్రియం కలిగించింది. అలాంటి శమీ వృక్షాన్ని పూజించి పెద్దల ఆశీర్వాదం తీసు కుంటారు.

ఈరోజున కొన్నిచోట్ల సీమోల్లంఘనం కూడా చేస్తారు. అంటే ఊరిపొలిమేరలు దాటి తిరిగి వెనక్కి రావడం అన్నమాట. ఇందులో అంత రార్థం ఏంటంటే సాధారణంగా శత్రువులూ, మిత్రులూ అనే అంశం వచ్చినప్పుడు వారిరువురి మధ్య కొన్ని హద్దులేర్పడతాయి. వాటిని తుడి చేసి, శత్రువులు సైతం పాతకక్షలు మరిచిపోయి మిత్రులుగా ఉండాలనేది ఈ సీమోల్లంఘన భావన. మరికొన్ని చోట్ల ఈ విజయదశమి రోజున పాలపిట్ట కనపడితే మంచిదనే భావన కూడా ఉంది.
రావణాసురుడిని సంహరించిన రాముడి విజయానికి సంకేతంగా దేశమంతటా దసరా రోజు రామలీలా ఉత్సవం జరుపుకుంటారు. రావణా సురుడి నిలువెత్తు బొమ్మలను దగ్ధం చేసి ఆనందం వ్యక్తపరుస్తారు.

తిరువీధుల్లో దేవదేవుడు
దసరా అనగానే కేవలం అమ్మవారి నవ రాత్రులు మాత్రమే ఉంటాయనుకునేరు. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి నవరాత్రులు నిర్వ హించిన విధంగానే వేంకటేశ్వర స్వామికి కూడా ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు ధ్వజస్తంభానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత నాగశేష, సింహ, కల్పవృక్ష వాహనం, మోహినీ అవతారం, గరుడవాహనం, గజవాహనం, సూర్యప్రభవాహనం, హంసవాహనం, అశ్వవాహనం, ముత్యపు పందిరి లాంటి వాహనాలపై తొమ్మిది రోజులూ ఆ వైకుంఠవాసుణ్ణి తిరువీధులలో ఊరేగిస్తారు.

నవరాత్రుల్లో నైవేద్యాలు
మొదటిరోజు: కట్టెపొంగలి
రెండవరోజు: పులిహోర
మూడవరోజు: కొబ్బరి అన్నం, కొబ్బరిపాయసం
నాలుగవరోజు: మినపగారెలు లేదా మొక్కజొన్నగారెలు లేదా పెసరగారెలు
ఐదవరోజు: పెరుగన్నం
ఆరవరోజు: కేసరి
ఏడవరోజు: శాకాన్నం లేదా కలగూర పులుసు
ఎనిమిదవరోజు: చక్రపొంగలి
తొమ్మిదవరోజు: పాయసం లేదా పరమాన్నం

Comments
Post a Comment