ఆది కైలాసం

శివునిపై నీకు ఎంతో ప్రేమ ఉండాలి... శివునికి నీపై ఎంతో దయ ఉండాలి... అప్పుడే కళ్ళముందు ఇలాంటి అద్భుతం ఆవిష్కృతమౌతుంది. మాటలకందని అనుభూతి గురించి ఏమని రాయను ? 13 రోజుల పాటు మనసుని, బుద్ధిని, శరీరాన్ని, ఆలోచనలని - ఆయనకోసం, ఆయనకోసం మాత్రమే, వినియోగించి...చివరకు ఆది కైలాస దర్శనం అనే అపూర్వమైన కానుక పొందిన మా అదృష్టాన్ని ఎలా వివరించను ?ఆయన విరాట్ స్వరూపాన్ని చూస్తూ మైమరిచిపోయిన మానసిక స్థితిని ఏమని వర్ణించను ? తడి కన్నులతో చూసి ఆనందించాలి. మనసారా స్వామిని వీక్షించి తరించాలి. తనివితీరా శివధ్యానం లో పొంగిపోవాలి. తనువుతీరా పార్వతీ సరోవరంలో స్నానమాడి అమ్మ కరుణని పొందాలి. ఆది కైలాసం వెళ్లి రావడం ఒక దీక్ష. మనః సంకల్పానికి ఒక పరీక్ష. వెళ్లే సమయంలో ఎప్పుడెప్పుడు ఆయనని చూస్తామా అనే ఎదురుచూపులు, తిరిగి వచ్చే సమయంలో ఆ ఆనందమయమైన జ్ఞాపకాలు - ఇవి చాలు, నిన్ను 200 కిలోమీటర్లపాటు వేలు పట్టుకొని నడిపించేస్తాయి. ఇంతటి దివ్య ప్రదేశం, ఇంతటి గొప్ప దర్శనం, ఇంతటి గొప్ప ప్రయాణం - న భూతో న భవిష్యతి. June 18th to July 5th - Day-wi...