గంగాధరుని దివ్యలీల

గంగాధరేశ్వర స్వామి - పేరు వింటేనే ఏదో మధురానుభూతి, ఎంత త్వరగా చూస్తానా అని అందమైన ఆతృత, స్వామి ఎలా ఉంటాడో అని చక్కని ఊహలు, అన్నీ కలిపి నెరవేరిన వేళ ఈ రోజు. నా సామి నాకోసం ఎదురు చూస్తున్నాడేమో అని అనిపించింది. నేను వెళ్ళే వరకూ అలంకారంలో దాగిన ప్రభువు, నన్ను చూసి ముసిముసిగా నవ్వుతూ బయటికి వచ్చి పలకరించాడు, కుశలం అడిగాడు, దీవించి పంపించాడు. అభిషేకం కళ్లారా చూసి తరించాం. స్వామిపై పసుపురంగులో ఉన్న నెయ్యి పూసి మర్దించగా, తెల్లని వెన్నలా మారిపోవడం అద్భుతం. 'పసుపు రాస్తే విభూది గా మారిందా' అన్నట్లు ఉంది ఆ దృశ్యం. ఆ ఆశీర్వాదాలు పొందిన ఫలం వెంటనే లభించింది. రంగనాథ స్వామి వారి అద్భుత దర్శనం దొరికింది. స్వయంభూ గా సాలగ్రామ రూపంలో ఉన్న స్వామివారిని చూసి అందరం మురిసిపోయాం. పారవశ్యంతో తిరిగి ఇంటికి వచ్చిన మమ్ము చూసి సరదా పడ్డావా పరమేశా !!!