మానవ శరీరం - రహస్యాలు
*మానవ శరీరం గురించి శివుడు పార్వతికి ఉపదేశించిన పరమ రహస్యాలు..!* స్వరం ఒకటి మూడు రూపములుగాను..అయిదు రూపములుగాను అగును. ఈ అయిదు మరలా ఒక్క రూపముగా అగును. మరలా అయిదు చొప్పున ఇరువైయిదు విధములుగా అగును. శరీరం నందు స్వరం పుట్టును . స్వరము నందు నాడిపుట్టును. స్వర నాడుల స్వరూపం తెలియచేయుటకు శరీరం చెప్పబడుచున్నది. శరీరం పిండం అనబడును. ఆ పిండం నందు శరీరం అణిగి ఉండును. శుక్ల శోణిత సమ్మితం అగు ఆ పిండం చైతన్యముతో కూడుకుని ఉండును. ఆ శుక్ల శోణితములు నాలుగు దినముల వరకు ప్రతి దినము నందు సమ్మేళనం అగుచుండును. అయిదు దినములకు బుడగ వలే అగును. పది దినములకు నెత్తురు అగును. పదిహేను దినములకు మాంసం ముద్ద అగును. ఇరువది దినములకు గట్టి మాంసం ముద్ద అగును. ఇరువైదు దినములకు సమాన రూపం అగును. మొదటి నెల యందు పంచభూతములు కూడును. రెండవ నెల యందు మేథస్సు కలుగును. మూడవ నెల యందు ఎముకలు మజ్జ కలుగును. నాలుగవ మాసము నందు అవయవములు జనించును. అయిదవ మాసము నందు రంధ్రములతో గూడిన చెవులు , ముక్కు, కన్నులు , నోరు మొదలగునవి జనించును. ఆరవ మాసం నందు కంఠరంధ్రం , ఉదరం పుట్టును . ఎడవ మాసం నందు పుట్టిన శిశువు బ్రతుకును గాని అల్పా...