Posts

Showing posts from November, 2019

నివేదనలు - ప్రసాదములు

నివేదనలు 1) చూతఫలం= మామిడిపండు  2) ఖర్జూర= ఖర్జూరం.             3) నింబ= వేప 4) నారింగ= నారింజ 5) భల్లాతకీ= జీడిపప్పు 6) బదరీ= రేగు 7) అమలక= ఉసిరికాయ 8) శుష్కద్రాక్ష= కిస్మిస్ 9) అమృత లేక బీజాపూరం=  జామపండు 10) ఇక్షుఖండం= చెఱకుముక్క 11) కదళీఫలం, రంభా ఫలం= అరటిపండు 12) నారికేళం= కొబ్బరికాయ 13) జంభీర= నిమ్మ పండు 14) దాడిమీ= దానిమ్మపండు 15) సీతాఫలం= సీతాఫలం 16) రామఫలం= రామఫలము 17) కపిత్త= వెలగ పండు 18) శ్రీ ఫలం, బిల్వఫలం= మారేడు 19) మాదీ ఫలం= మారేడు పండ్లు 20) జంభూఫలం= నేరేడు 21) వాతాదం= బాదము పప్పు ప్రసాదములు 1) కుశలాన్నం = పులగం 2) చిత్రాన్నం= పులిహోర 3) క్షీరాన్నం= పరమాన్నం 4) పాయసం= పాయసం 5) శర్కరాన్నం= చక్కెరపొంగలి 6) మరీచ్యన్నమ్= కట్టు లేదా మిరియాల పొంగలి 7) దధ్యోదనం= పెరుగు అన్నము 8) తిలాన్నం= నువ్వులపొడితో చేసిన అన్నం 9) శాకమిశ్రితాన్నం= కిచిడీ 10) గుడాన్నం = బెల్లపు పరమాన్నం 11) సపాదభక్ష్యం= గోధుమనూకతో చేసిన ప్రసాదం  (గోధుమ నూక పంచదార నెయ్యి సమపాళ్ళలో వేసి చేసింది గాన ఆపేరు) 12) గుడమిశ్రిత ముద్గ సూపమ్= వడపప్పు 13) ...

యమదూత వర్తమానం

శ్మశానానికి వెళ్ళి  కాలుతున్న శవాలను అడిగా.. ఎక్కడకి వెళుతున్నారు మీరు అని?? ఏమో తెలీదు అయినా నువ్వెవరు ప్రాణాలతో శ్మశానానికి ఎందుకొచ్చావ్ ,ఎలా వచ్చావ్,ఇంత అర్థరాత్రి, అని అడిగింది కాలుతున్న ఓ శవం.. నేను కొన్ని రోజులనుండి  మానసిక సంఘర్షణకు లోనౌతున్నా మనం ఎవరం ,ఎందుకు పుడుతున్నాం ఎందుకు చచ్చిపోతున్నాం మనవెంట ఏం వస్తుంది?,... అని మాట పూర్తవకుండానే నా మాటకి అడ్డొచ్చింది ఆ శవం, పిచ్చివాడా అవి అందరికీ వచ్చే,ప్రశ్నలే,ప్రతీ హృదయంలో  జరిగే సంఘర్షణే..ఆ మాటకొస్తే నామటుకునాకు చాలాసార్లు వచ్చింది.కాని ఎవరికైనా తెలిస్తే నవ్వుతారేమో అని ఎవరికి చెప్పకుండా ఇక్కడే ఉంటాం ఇదంతా మనదే అని,అణా కూడా దానం చేయకుండా, చాలా ధనం కూడబెట్టా,కొంత భూములు తవ్వికూడా దాచుకున్నా వాటిని తగ్గలెయ్యా నేను తగలబడిపోతున్నా రావట్లేదే???ఇందాకణ్ణించీ అదే ఆలోచిస్తున్నా.. సరే నువ్వేం చేసావో చెప్పు.. మళ్ళీ నేను చెప్పడం ఆరంభించా.. అలా మానసిక సంఘర్షణతో ఉండలేక అందర్ని అడగడం మొదలెట్టా ఎవ్వరూ చెప్పలేదు సరికదా కొంతమంది తిట్టారు,కొంతమంది కొట్టడానికొచ్చారు,కొంతమంది పిచ్చోడన్నారు..కొంతమందైతే సంపాదించడం చేతకాకే ఇలాంటివి ఆల...