మౌనం 🤫
మౌనం ఒక మానసిక నిశ్శబ్దం. మాట ఓ భౌతిక శబ్దం. మౌనం ఓ సమస్యకు పరిష్కారం. మాట ఒక సమస్యకు కారణం. మాట హద్దులు దాటితే యుద్ధం. మౌనం హద్దులు దాటితే ఆత్మ జ్ఞానం. కొన్నిటికి సమాధానం మౌనం. కొన్నిటికి సమాధానం మాట. మాట మౌనం రెండు అవసరం. వాటిని వాడే విధానం తెలుసుకోవాలి. అది తెలిసిన వారు ప్రతిక్షణం ఆనందంగా ఉండగలరు. మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు. నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ విజ్రుంభణను ఆపడం. మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియమంటారు. మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం. మౌనమంటే - నిరంతర భాషణ. చింత, చింతన లేని తపస్సు. అఖండ ఆనందపు ఆత్మస్థితి. విషయ శూన్యావస్థ. యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ ఆదిశంకరులు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అంద...