Posts

Showing posts from February, 2025

అష్టాదశ పురాణాలు

మనం అనేక సందర్భాల్లో ‘అష్టాదశ పురాణాలు’ అని వింటూ ఉంటాం. అయితే ఆ 18 పురాణాల పేర్లూ ఒకపట్టాన గుర్తుకు రావు. ఒకవేళ అన్నింటి పేర్లూ తెలిసినా, ఏ పురాణంలో ఏముందో తెలియని పరిస్థితి. అనంతంగా ఉన్న ఈ పౌరాణిక విజ్ఞానాన్ని, అపారమైన వేదరాశిని వేదవ్యాసుడే అంశాల వారీగా విభజించాడు. అందుకే విష్ణుసహస్రనామంలో వ్యాసాయ విష్ణురూపాయ.. వ్యాసరూపాయ విష్ణవే అని ఉంటుంది. వేదవ్యాసుడు పురాణాలను రచిస్తే, వాటిని మహాపౌరాణికుడు సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు. వారి ద్వారా ఇవి లోకానికి వెల్లడయ్యాయి. ఎంతో విస్తారమైన ఈ పురాణాలను మనం చదవలేకపోయినప్పటికీ, అసలు ఆ పురాణాలేమిటి, ఏ పురాణంలో ఏముందో రేఖామాత్రంగా అయినా తెలుసుకోగలిగితే అవకాశం ఉన్నప్పుడు విపులంగా తెలుసుకోవచ్చు.   18 పురాణాల పేర్లు :  1.⁠ ⁠మత్స్యపురాణం  2.⁠ ⁠కూర్మపురాణం  3.⁠ ⁠వామన పురాణం  4.⁠ ⁠వరాహ పురాణం  5.⁠ ⁠గరుడ పురాణం  6.⁠ ⁠వాయు పురాణం  7.⁠ ⁠నారద పురాణం  8.⁠ ⁠స్కాంద పురాణం  9.⁠ ⁠విష్ణుపురాణం 10.⁠ ⁠భాగవత పురాణం 11.అగ్నిపురాణం 12.⁠ ⁠బ్రహ్మపురాణం 13.⁠ ⁠పద్మపురాణం 14.⁠ ⁠మార్కండేయ పురాణం 15.⁠ ⁠బ్రహ్మవైవర్త పురాణం 16.లింగపురాణం 17.బ్రహ్మాండ పురాణం 18.⁠ ⁠భవిష్యపురా...