తృటి
మనం అప్పుడప్పుడు వింటుంటాం.. పత్రికలలో చదువుతుంటాం.. "తృటి" లో తప్పిన ప్రమాదం, అని.. అసలీ తృటి అంటే ఏమిటి? మన పూర్వీకులు మనం కాలాన్ని ఎన్ని భాగాలు గా విడదీసారో, వాటి పేర్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. తృటి =సెకండ్ లో 1000 వంతు 100 తృటులు =1 వేద 3 వేదలు=1 లవం 3 లవాలు=1 నిమేశం అంటే రెప్ప పాటుకాలం నిముషం కాదు.. 3 నిమేశాలు=1 క్షణం, 5 క్షణాలు=1 కష్ట 12 కష్టాలు = ఒక నిముషం 15 కష్టాలు=1 లఘువు 15 లఘువులు=1 దండం 2దండాలు=1 ముహూర్తం 2 ముహూర్తాలు=1 నాలిక 7 నాలికలు=1 యామము,ప్రహారం 4 ప్రహరాలు=ఒక పూట 2 పూటలు=1 రోజు 15 రోజులు=ఒక పక్షం 2 పక్షాలు=ఒక నెల. 2 నెలలు=ఒక ఋతువు 6 ఋతువులు=ఒక సంవత్సరం. 10 సంవత్సరలు=ఒక దశాబ్దం 10 దశాబ్దాలు=ఒక శతాబ్దం. 10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది 100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు 4లక్షల 32 వెల సంవత్సరాలు= కలియుగం 8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం 12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం 17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం) 71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం 14 మన్వంతరాలు=ఒక కల్పం 200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు 365 బ్రహ్మర...