Posts

Showing posts from February, 2018

గుండ్ల బ్రహ్మేశ్వరం

Image
సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్న దర్శనం -  ఈసారి స్వామి కరుణించాడు (గత ఏడాది గురించి ఇక్కడ చదవండి).  గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో 45 కిలో మీటర్ల దూరంలో ఉన్న అయ్యోరి గుడికి వెళ్ళి వచ్చాం. శివరాత్రి పండుగ సందర్భంగా సంవత్సరం లో ఒకరోజు మాత్రమే ఈ ఆలయం తెరవబడుతుంది. అదికూడా, 100 జీపులు మాత్రమే పంపుతారు.  అందుకే, ఈ స్వామితో అంత వీజీ కాదు సుమీ. ఉదయాన్నే ముందుగా మహానంది క్షేత్రం లో ఉన్న సర్వేశ్వరుని దర్శనం చేసుకుని, దిగువమెట్ట చేరుకున్నాం.  అక్కడ నుంచి, 45 కిలో మీటర్లు జీపులో వెళ్ళాలి.  అడవిలో నెమ్మదిగా వెళ్ళాలి కదా.  అందుకే, సుమారు 3:30 గంటల పాటు సాగిందా ప్రయాణం.  అశ్వత్థామ ప్రతిష్ఠించిన ఈ గుండ్ల బ్రహ్మేశ్వరుడు దట్టమైన అడవిలో దాగి ఉన్నాడు.  చాలా కొద్ది మందికి మాత్రమే దర్శనం ఇచ్చి ఉంటాడు కదూ.  అందుకే, జనసంద్రం ఎక్కువగా కూడకముందే, 3-4 సార్లు దర్శనం చేసుకుని వచ్చాం.  రేపు అనేది లేదు కదా అనేలా మాటిమాటికీ ఆయన దగ్గరకు వెళ్తూ ఉంటే ముసిముసి నవ్వులు నవ్వుతూ చూసే ఉంటాడు, ఆ భోళా శంకరుడు. తనివితీరా చూసి, చేత్తో తాకి, తన్మయత్వం తో త...