గుండ్ల బ్రహ్మేశ్వరం
సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్న దర్శనం - ఈసారి స్వామి కరుణించాడు (గత ఏడాది గురించి ఇక్కడ చదవండి). గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో 45 కిలో మీటర్ల దూరంలో ఉన్న అయ్యోరి గుడికి వెళ్ళి వచ్చాం. శివరాత్రి పండుగ సందర్భంగా సంవత్సరం లో ఒకరోజు మాత్రమే ఈ ఆలయం తెరవబడుతుంది. అదికూడా, 100 జీపులు మాత్రమే పంపుతారు. అందుకే, ఈ స్వామితో అంత వీజీ కాదు సుమీ.
ఉదయాన్నే ముందుగా మహానంది క్షేత్రం లో ఉన్న సర్వేశ్వరుని దర్శనం చేసుకుని, దిగువమెట్ట చేరుకున్నాం. అక్కడ నుంచి, 45 కిలో మీటర్లు జీపులో వెళ్ళాలి. అడవిలో నెమ్మదిగా వెళ్ళాలి కదా. అందుకే, సుమారు 3:30 గంటల పాటు సాగిందా ప్రయాణం. అశ్వత్థామ ప్రతిష్ఠించిన ఈ గుండ్ల బ్రహ్మేశ్వరుడు దట్టమైన అడవిలో దాగి ఉన్నాడు. చాలా కొద్ది మందికి మాత్రమే దర్శనం ఇచ్చి ఉంటాడు కదూ.
అందుకే, జనసంద్రం ఎక్కువగా కూడకముందే, 3-4 సార్లు దర్శనం చేసుకుని వచ్చాం. రేపు అనేది లేదు కదా అనేలా మాటిమాటికీ ఆయన దగ్గరకు వెళ్తూ ఉంటే ముసిముసి నవ్వులు నవ్వుతూ చూసే ఉంటాడు, ఆ భోళా శంకరుడు. తనివితీరా చూసి, చేత్తో తాకి, తన్మయత్వం తో తల తాకించి తిరిగి వచ్చిన మా ఆనందం ఎంతని చెప్పాలి. కళ్ళలో విజయగర్వం మెరిసిపోతూ కనిపించామేమో, అందరికీ !!!
తిరుగు ప్రయాణంలో సర్వ లక్ష్మీ సమేత నృసింహస్వామి వారిని చూసి, తృప్తిగా రైలు ఎక్కేసాం.
Places visited:
13th Feb - మహానంది క్షేత్రం - 4AM
13th Feb - గుండ్ల బ్రహ్మేశ్వరుడు - 11AM
13th Feb - సర్వ లక్ష్మీ సమేత నృసింహస్వామి - 4PM
13th Feb - ప్రథమ నంది, నంద్యాల - 7PM
13th Feb - మహానంది క్షేత్రం - 4AM
13th Feb - గుండ్ల బ్రహ్మేశ్వరుడు - 11AM
13th Feb - సర్వ లక్ష్మీ సమేత నృసింహస్వామి - 4PM
13th Feb - ప్రథమ నంది, నంద్యాల - 7PM
గుండ్ల బ్రహ్మేశ్వరం ఆలయం ముందర భక్తాగ్రణ్యునితో ...
Comments
Post a Comment