శివరాత్రి సంబరం

ముక్కంటిని దర్శించుకోవడానికి ఆయనకు ఇష్టమైన శివరాత్రి పర్వదినం కంటే మంచిరోజు దొరుకుతుందా? అయ్యోరిని చూడటానికి రెండు కన్నులు చాలలేదు, అభిషేకానికి బిందెడు నీరు సరిపోలేదు, తల ఆనించి తాకుతూ ఉంటే సమయం తెలియలేదు, చేతులారా స్పృశిస్తూ ఉంటే గుండె గెంతులు ఆపడంలేదు, శివుని పక్కనే కూర్చొని కబుర్లాడాలని ఉన్నా మాటలు రావడం లేదు. ఆనందం నిండిన అచేతన స్థితి - ఎంత పరవశం, అంతా శివ సంకల్పం.

గుండ్ల బ్రహ్మీశ్వరంలో వెలసిన శివుడిని దర్శించాలని వెళ్లిన మాకు, నిరాశ ఎదురైంది.  నల్లమల అడవుల్లోకి అనుమతి దొరకలేదు.  వెంటనే సత్తువ తెచ్చుకొని అప్పటికప్పుడు వేరొక ప్రణాళిక ఆలోచించుకొన్నాం.  మోక్షగుండంలో వెలసిన ముక్తీశ్వర స్వామితో మొదలుపెట్టి,  నవనందులను దర్శించుకొని తరించిపోయాం.

రుద్రకోటిలో ఉన్న రుద్రాణీ సమేత రుద్రకోటేశ్వర స్వామి తొలి అభిషేకం చేసే మహద్భాగ్యాన్ని ప్రసాదించాడు. కృష్ణా తుంగభద్రా సంగమంలో ధర్మరాజు కోరికమేరకు చెట్టు మాను లింగమై వెలసిన సంగమేశ్వరుడు కూడా స్పర్శ దర్శనంతో తరించమని ఆశీర్వదించాడు.  అలంపురం లో బాల బ్రహ్మీశ్వర స్వామి ఆవు కాలిగిట్ట రూపంలో ఉన్నాడని తెలుసుకొని ఆశ్చర్యపోయాం.  ముట్టుకొని ముగ్ధులమైపోయాం. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న జోగులాంబ దర్శనంతో నిండుగా తిరుగు ప్రయాణమైపోయాం.

జగద్రక్షకునితో మా మార్కండేయుడు


Places visited:
మోక్షగుండం - ముక్తీశ్వర స్వామి - 25 Feb 11AM
నెమలిగుండం - రంగనాయక స్వామి - 25 Feb 2PM
- సర్వ లక్ష్మీ సమేత నృసింహస్వామి - 25 Feb 4PM
నంద్యాల  - ప్రమథ నంది - 25 Feb 4:30PM
నంద్యాల  -  నాగ నంది - 25 Feb 4:45PM
నంద్యాల  -  సోమ నంది - 25 Feb 5PM
నంద్యాల  - సూర్య నంది - 25 Feb 5:30PM
నంద్యాల  - విష్ణు (కృష్ణ) నంది - 25 Feb 6:30PM
నంద్యాల  - శివ నంది - 25 Feb 7:30PM
మహానంది  - గరుడ నంది - 25 Feb 8:30PM
మహానంది  - మహా నంది - 25 Feb 9PM
మహానంది - వినాయక నంది - 25 Feb 9PM

రుద్రకోటి - రుద్రాణీ సమేత రుద్రకోటేశ్వర స్వామి - 26 Feb 7:30 AM
సంగమేశ్వరం - సంగమేశ్వర స్వామి - 26 Feb 11AM
అలంపురం - బాల బ్రహ్మీశ్వర స్వామి, జోగులాంబ - 26 Feb 4PM


Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం