శివుడు - రాముడు - కలిసి దీవిస్తే
అంతకన్నా భాగ్యం ఇంకేముంది? ఇంత అద్భుత దర్శనాలు ప్రసాదిస్తారు. తనివితీరా చూసి తరించడమే.
ఒకే పానుమట్టం మీద ఐదు శివలింగాలు - ఇంకెక్కడా అగుపించని అద్భుతం ఖండ్యాం గ్రామంలో ఆవిష్క్రతమైంది. బలరాముడు ప్రతిష్టించిన ఈ విశ్వేశ్వరుడిని చూసి తరించాం. ఆదిత్య, గౌరి, విష్ణు, వినాయక, మహేశ్వర లింగాలకు జలాభిషేకంతో మురిసిపోయాం.
తిరుగు ప్రయాణంలో త్రోవ మారిస్తే, రామాలయం అగుపించింది. గుళ్ళసీతారాంపురం గ్రామంలో స్వయంభూ గా వెలసిన సీతారాములు ఎంతో అందమైన మందహాసంతో పలుకరించారు. మరెక్కడా లేని విధంగా రాముడు ధనుర్బాణాలు విసర్జించి, సీతమ్మవారితో సహా ఏకాంతవాసం చేస్తున్నాడిక్కడ. లక్ష్మణస్వామి, హనుమలు కాకుండా సీతారాములు మాత్రమే వెలిసిన అరుదైన క్షేత్రమిది.
Temples visited on 5th Feb:
కాశీ విశ్వేశ్వరుడు - ఖండ్యాం, పొందూరు దగ్గర - 8AM
సీతారాములు - గుళ్లసీతారాంపురం, రాజాం దగ్గర - 11AM
సీతారాములు - గుళ్లసీతారాంపురం, రాజాం దగ్గర - 11AM
అందమైన ఆలయంలో ఒక అందమైన జ్ఞాపకం
Comments
Post a Comment