కనకధారా స్తోత్రం - అర్థం

శ్లో॥ అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ । అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా: ॥2 తాత్పర్యము : ఆఁడు తుమ్మెద నల్లని తమాల వృక్షముపై వాలినట్లుగా ఏ మంగళదేవత యొక్క ఓరచూపు నీలమేఘశ్యాముఁడైన భగవాన్ విష్ణుమూర్తిపై ప్రసరించినప్పుడు ఆ వృక్షము తొడిగిన మొగ్గలవలె ఆయన శరీరముపై పులకాంకురములు పొడమినవో, అష్టసిద్ధులను వశీకరించుకొన్న ఆ శ్రీ మహాలక్ష్మీ భగవతి యొక్క కృపా కటాక్షము నాకు సమస్త సన్మంగళములను సంతరించును గాక ! శ్లో॥ ముగ్ధా ముహుర్ విదధతీ వదనే మురారే: ప్రేమ ప్రపాత ప్రణిహితాని గతాగతాని । మాలా దృశోర్ మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయా: ॥3 తాత్పర్యము : ఒక పెద్ద కమలము చుట్టుత ఆగి-ఆగి పరిభ్రమించు తుమ్మెద వలె విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువలెత్తిన ప్రేమను మాటిమాటికిని ప్రసరింపజేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదల ననుగ్రహించు గాక ! శ్లో॥ విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్షమ్ ఆనంద కంద మనిమేష మనంగ తంత్రమ్ । ఆకేకర స్థిర కనీనిక పద్మనేత్రమ్ భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయా: ॥4 తాత్పర్యము : తనను భజించువారికి దేవేంద్ర పదవిని సైతమివ్వజ...