ఏడుజన్మల దెప్ప
!! యేజన్మకాజన్మ భవసాగరాలయం
ఏడుజన్మల దెప్ప ఈశ్వరుండే దారి !!
ఏడుజన్మల దెప్ప ఈశ్వరుండే దారి !!
!! యేరూపమై నుండో పైనుండి బ్రాణము
మాయ గర్భములోకి జీవకణమైవచ్చు
పేగుబంధముతో పెనసి మలమూత్రముల
ప్రాణవాయువు దాకిడి ప్రపంచపుజూపు !!
మాయ గర్భములోకి జీవకణమైవచ్చు
పేగుబంధముతో పెనసి మలమూత్రముల
ప్రాణవాయువు దాకిడి ప్రపంచపుజూపు !!
!! గతకర్మములెల్ల గతుల బంధాలైమలసి
పాపపుణ్యపు జీవితము ఋణసంబంధము
తెగని అరిషడ్వర్గాల అలరు జీవనము
దైవంబు దలపులో మరపులోన బెట్టి !!
పాపపుణ్యపు జీవితము ఋణసంబంధము
తెగని అరిషడ్వర్గాల అలరు జీవనము
దైవంబు దలపులో మరపులోన బెట్టి !!
!! చింతాజన్మము భవదురిత జన్మము
యెకడను ఈశుండే దిక్కైన దిక్కుగను
అన్నిదిక్కులవాడు అలరి భజియించు
జన్మకేలే కైలాస పరమపధయోగము !!
యెకడను ఈశుండే దిక్కైన దిక్కుగను
అన్నిదిక్కులవాడు అలరి భజియించు
జన్మకేలే కైలాస పరమపధయోగము !!
రచన
నరేషాచారి
నరేషాచారి
Comments
Post a Comment