చిదంబరం - శ్రీరంగం
సెలవులు దొరికితే చాలు, ఏ ఆలయాలకు వెళ్లి దర్శనాలు చేసుకుందామా అని ఆలోచన ఉంటే బావుంటుంది కదూ. మన ఆలోచనలు అలా ఉంటే, ఆయన కూడా అటువైపు నడిపిస్తాడు సుమా. ముందుగా, అరుణాచలం వెళ్లి, అగ్ని లింగాన్ని దర్శించుకున్నాం. నెలరోజుల్లోన్నే, రెండోసారి దర్శనం ఇచ్చిన స్వామికి కృతఙ్ఞతలు చెప్పుకొని, అక్కడి నుంచి వృద్ధాచలం వెళ్లాం. ఎంతో పురాతనమైన, అందమైన ఆలయం... ఆయనముందు చాలా సమయం గడపగలిగాం. సుందర నాయనారు ని 12000 బంగారు నాణాలతో శివయ్య అనుగ్రహించిన దివ్య సుక్షేత్రం. తనివితీరా స్వామిని కళ్లారా చూసుకొని, అక్కడినుంచి శ్రీముష్ణం వెళ్లాం. అష్ట స్వయం వ్యక్త క్షేత్రాలలో ఒకటి అయిన ఈ అద్భుత ఆలయం చూడటానికి రెండు కళ్ళూ చాలవు. స్వామి ఎంత చక్కగా ఉన్నారో... చాలాసేపు ఆయననే చూస్తూ ఉండిపోయేసరికి, ఆలయం మూసే సమయం అయిపోయింది. అక్కడినుంచి చిదంబరం వెళ్లి అక్కడ రాత్రి బస. మరునాడు, చిదంబరం నటరాజ స్వామి, శివకామసుందరి.. ఇద్దరూ ఇద్దరే. గంటకి పైగా ఆలయంలో గడిపినా, తనివితీరలేదు. పంచభూత శివాలయాల్లో, ఆకాశలిం...