Posts

Showing posts from January, 2025

ఆత్మానుభూతి

 అనన్య భక్తి భగవంతుడు సృష్టించిన పదార్ధాల తో తిరిగి భగవంతుని ఆరాధించటం కాకుండా, మన మనో పుష్పాన్ని భగవంతునికి  అర్పించటమే అనన్య భక్తి! ఈ మనో పుష్పం శుద్ధమై ఉండాలి.! దానికి ముందు ఇంద్రియ నిగ్రహం, సర్వ భూతదయ, శాంతి, క్షమా అహింసలు, తపము, ధ్యానం, సత్యం ఇవన్నీ సాధించాలి. నిరంతరం తపన, సాధన చేయాలి. ప్రతీ జడ, జీవ పదార్ధము పరమాత్మ స్వరూపమే అన్న దాన్ని అనుభూతి పొందాలి. విశ్వం అంతటా పరమాత్మ చైతన్యమే నిండి ఉంది అని తెలుసు కొంటేనే ఆ శక్తి మనలో, జడ, జంతు జీవాలలో ఉంది అని అర్ధం అవుతుంది. మనసు ఎపుడు కూడా బైటకే, బాహ్య వస్తువుల వైపే పరుగులు తీస్తూ ఉంటుంది. అలాంటి మనసుని శుద్ధి చేసుకొని అంతర్ముఖం చేయాలి. మనసు, బుద్ధి ఏకమై ఆత్మలో లయం అవ్వాలి...      లేదా మనసే ఆత్మగా ప్రకాశించాలి. చిత్త శుద్ధి పొందిన మనసుని ఆత్మలో ప్రతిష్టించాలి!. ఇలాంటి మనో పుష్పాన్నే భగవంతునికి సమర్పించాలి! ఇదే అనన్య భక్తి, ఆత్మానుభూతి. గృహస్తు అయినా, బ్రహ్మ చారి అయినా, సన్యాసి అయినా మనసు శుద్ధి చేసుకొంటే కానీ భక్తుడు కాలేడు. చిత్తశుద్ధి లేని పూజ పరమాత్మ స్వీకరించడు.ముక్తి పొందాలంటే భక్తి కావాలి.భక్తి అంటే అనన్య భక...