Posts

గంగాధరుని దివ్యలీల

Image
గంగాధరేశ్వర స్వామి - పేరు వింటేనే ఏదో మధురానుభూతి, ఎంత త్వరగా చూస్తానా అని అందమైన ఆతృత, ‌స్వామి ఎలా ఉంటాడో అని చక్కని ఊహలు, అన్నీ కలిపి నెరవేరిన వేళ ఈ రోజు. నా సామి నాకోసం ఎదురు చూస్తున్నాడేమో అని అనిపించింది.  నేను వెళ్ళే వరకూ అలంకారంలో దాగిన ప్రభువు, నన్ను చూసి ముసిముసిగా నవ్వుతూ బయటికి వచ్చి పలకరించాడు, కుశలం అడిగాడు, దీవించి పంపించాడు.  అభిషేకం కళ్లారా చూసి తరించాం.  స్వామిపై పసుపురంగులో ఉన్న నెయ్యి పూసి మర్దించగా, తెల్లని వెన్నలా మారిపోవడం అద్భుతం.  'పసుపు రాస్తే విభూది గా మారిందా' అన్నట్లు ఉంది ఆ దృశ్యం.  ఆ ఆశీర్వాదాలు పొందిన ఫలం వెంటనే లభించింది. రంగనాథ స్వామి వారి అద్భుత దర్శనం దొరికింది. స్వయంభూ గా సాలగ్రామ రూపంలో ఉన్న స్వామివారిని చూసి అందరం మురిసిపోయాం. పారవశ్యంతో తిరిగి ఇంటికి వచ్చిన మమ్ము చూసి సరదా పడ్డావా పరమేశా !!!

కడప కోనల్లో శివయ్య

Image
శివ నామ స్మరణ చేస్తూ ఉండవే మనసా !!! ఆ ఆది గురుడు ఎప్పుడూ కాపు కాస్తూ ఉంటాడు, ఎప్పుడో ఒకప్పుడు కరుణిస్తాడు, కనిపిస్తాడు.  ఇదీ జీవన మంత్రం, ఇదే జీవిత పరమార్ధం. కొండల్లో వెలిసినా, కోనల్లో గుట్టుగా దాగినా, జ్యోతి గ్రామం లో శివుడు  ఇలా దర్శనమిచ్చాడు.. Temples visited: 1. Pushpagiri (Lord Vishnu/Lord Siva Temples) - 19th May 5PM 2. Venkateswara Swamy Temple (Duvuni Kadapa) - 19th May 8PM 3. Panchalingeswara Temple ( NithyaPooja Kona) - 20th May 7AM 4. Nitya Poojayya Swamy (NithyaPooja Kona) - 20th May 8AM 5. AkkaDevatala Temple (Saptha Matrikas - Nithyapooja Kona) - 20th May 9AM 6. Lord Siva Temples (South Gate of Srisailam, Jyothi village) - 20th May 11AM 7. Siddheswara Swamy (Sidhavatam) - temple closed, Sathwik had darshan - 20th May 11:30AM 8. Kapardeeswara Swamy Temple (Kapardeeswara Kona) - 20th May 12noon 9. KodandaRama Temple (Vontimitta) - 20th May 12:30PM 10. Soumyanatha Swamy Temple (Nandaluru) - 20th May 1:30PM ...

మాతృ పంచకం

మనస్సును  కదిలించే  ఆదిశంకరుల మాతృ పంచకం--------------- కాలడి లో ఆది శంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై వుంది. తనను తలుచుకున్న వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు ఉత్తరక్రియలు చేశారు. ఆ ...

అష్టసిద్ధులు

అష్టసిద్ధులంటే ఏమిటి? భారతీయ తత్వ శాస్త్రంలో సిద్ధి అన్నమాటకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. సాధకుడు యోగమార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు, ఒక స్థాయిలో అతను భౌతికమైన సూత్...

గుండ్ల బ్రహ్మేశ్వరం

Image
సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్న దర్శనం -  ఈసారి స్వామి కరుణించాడు (గత ఏడాది గురించి ఇక్కడ చదవండి).  గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో 45 కిలో మీటర్ల దూరంలో ఉన్న అయ్యోరి గుడికి వెళ్ళి వచ్చాం. శివరాత్రి పండుగ సందర్భంగా సంవత్సరం లో ఒకరోజు మాత్రమే ఈ ఆలయం తెరవబడుతుంది. అదికూడా, 100 జీపులు మాత్రమే పంపుతారు.  అందుకే, ఈ స్వామితో అంత వీజీ కాదు సుమీ. ఉదయాన్నే ముందుగా మహానంది క్షేత్రం లో ఉన్న సర్వేశ్వరుని దర్శనం చేసుకుని, దిగువమెట్ట చేరుకున్నాం.  అక్కడ నుంచి, 45 కిలో మీటర్లు జీపులో వెళ్ళాలి.  అడవిలో నెమ్మదిగా వెళ్ళాలి కదా.  అందుకే, సుమారు 3:30 గంటల పాటు సాగిందా ప్రయాణం.  అశ్వత్థామ ప్రతిష్ఠించిన ఈ గుండ్ల బ్రహ్మేశ్వరుడు దట్టమైన అడవిలో దాగి ఉన్నాడు.  చాలా కొద్ది మందికి మాత్రమే దర్శనం ఇచ్చి ఉంటాడు కదూ.  అందుకే, జనసంద్రం ఎక్కువగా కూడకముందే, 3-4 సార్లు దర్శనం చేసుకుని వచ్చాం.  రేపు అనేది లేదు కదా అనేలా మాటిమాటికీ ఆయన దగ్గరకు వెళ్తూ ఉంటే ముసిముసి నవ్వులు నవ్వుతూ చూసే ఉంటాడు, ఆ భోళా శంకరుడు. తనివితీరా చూసి, చేత్తో తాకి, తన్మయత్వం తో త...

బ్రహ్మముహూర్తం

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 96-48 నిమిషాల మధ్యకాలం ఇది. నిజానికి తెల్లవారు ఝామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని 'ఆసురీ ముహూర్తం' అని... ఆసురీ ముహూర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని 'బ్రహ్మముహూర్తం' అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తమున లేచి.. భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలి. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎ...

షోడశ సంస్కారాలు

సమాజం అంటే మనుష్యులు తప్ప వేరెవరో కాదు. అందుకే మన సంప్రదాయయలు మానవ వికాసానికై ౠషులచే నిర్దేశించబడ్డాయి. ఈ సంప్రదాయలనే సంస్కారాలు అని చెబుతారు. మన జీవితాలు ఏదో ఒక దశలో ఈ సంప్రదాయలను అనుసరించే ముందుకు సాగుతుంటాయి. మనుస్మౄతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా గుర్తించింది. 1. వివాహాం, 2. గర్భాధానం, 3. పుంసవనం, 4. సీమంతం, 5. జాతకర్మ, 6. నామకరణం, 7. అన్నప్రాశనం, 8. చూడాకర్మ, 9. నిష్క్రమణం, 10. ఉపనయనం, 11. కేశాంతం, 12. సమావర్తనం. అయితే మరికొంతమంది స్మౄతికాకురులు ఈ సంస్కారలను షోడశ (16) సంస్కారాలుగా పేర్కొన్నారు. కర్ణభేధం, విద్యారంభం, వేదారంభం,అంత్యేష్టి అంటూ మనువు చెప్పిన 12 సంస్కారాలకు, ఈ నాలుగు సంస్కారాలను జోడించి షొడశ సంస్కారాలుగా గుర్తించారు. మనిషి పుట్టుకనుంచి చనిపోయేవరకు సంస్కారమయమే. ఇందులో అంత్యేష్టి తప్ప మిగిలిన 15 కర్మల ద్వారా జీవుడు సంస్కరింపబడుతూ మరణం తర్వాత ఉత్తమలోక ప్రాప్తిని పొందడం జరుగుతుంది. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడ తొలిగి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిధ్దిస్తుంది. సంస్కారల ఆచరణ మనిషి జీవితంలో వివాహాంతో మొదలవుతుంది. అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్ర...