చాగంటి వారిని చూశానోచ్ !!!

నిజం !!!
ఇది నిజంగా నిజం...  కొమ్మాది లో ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ  అద్భుతం జరిగింది...
సోమవారం కదా,  మంగళ గౌరీ సమేత శ్రీ వైశాఖేశ్వర స్వామి  దర్శనం కోసం అని వెళ్లి, హారతి తీసుకొని తిరిగివస్తూ ఉంటే, మా అమ్మాయి, "నాన్నా... చూసావా, చాగంటి కోటేశ్వరరావు గారు..." అని చెప్పింది.  దగ్గరకి వెళ్లి  చూస్తే, నిజమే...
స్వామి దర్శనం తో పాటు, గురువు గారి దర్శనం కూడా అయ్యింది.  "అయ్యా!!! నమస్కారం" అని చెప్పాను.. ప్రతి నమస్కారం చేసుకుంటూ చాగంటి వారు పత్నీ సమేతం గా పక్క గుడి లోకి వెళ్ళిపోయారు ... ఎంతో సంతృప్తి తో మేము ఇంటికి తిరిగి వచ్చాము. 

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం