Posts

Showing posts from July, 2015

శ్రీశైల మల్లన్న - లొద్ది మల్లయ్య

Image
శివుని ఆనతి లేకుండా ఆయన దర్శనం లభించదు అని అంటారు... మరి శివుడు సరే అంటే, ఇక ఆనందమే కదా... ఇంతకు ముందు చాలా సార్లు ప్రయత్నించినా, శ్రీశైలం వెళ్ళడం కుదరలేదు .. కానీ, ఇప్పుడు దగ్గరుండి అంతా ఆయనే చూసుకొని రప్పించుకున్నాడు అంటే నమ్మక తప్పదు సుమా... శ్రీశైలం లో అభిషేకం ఆనందమయం... శివ స్పర్శ యొక్క అనుభూతి  ఇంకా నా చేతులను వీడలేదు... మహేశ్వరుని వీభూది రేఖలు ఇంకా నా నొసటన ఉన్నట్టే ఉంది... దక్కింది, ఆయన దయ వల్ల ఇన్నాళ్టికి ఆ దివ్యదర్శనం దొరికింది... హర హరా అంటూ చెంబుడు నీళ్ళు శివుని మీద పోసిన ఈ నా చేతుల అదృష్టం ఏమని వర్ణించను? లొద్ది మల్లయ్య ఆలయం ప్రతీ ఏడూ తొలి ఏకాదశి నాడు మాత్రమే తెరుస్తారట.  కొండల్లో వెలసిన ఆ దేవదేవుని చూడాలంటే, 4km పాటు కొండలు ఎక్కి దిగి కష్టపడాలి, ఇష్టపడాలి... 60+ ఏళ్ళ వయసులో కూడా, మా అమ్మ రాగలిగింది అంటే, 8 ఏళ్ళ లోపు పిల్లలు ఇద్దరూ సునాయాసంగా ఎక్కేసారంటే, శంకరుని మాయ కాక ఇంకేంటి? A selfie while on the drive Temples visited: ఉమామహేశ్వరం - ఉమామహేశ్వరుడు - 25th July 5PM శ్రీశైలం - మల్లికార్జున స్వామి , భ్రమరాంబ...

గోదారి పుష్కర స్నానం

Image
144 సంవత్సరాల తరువాత వచ్చిన అరుదైన పుష్కరాలంట... గోదారమ్మ లో మునకేసినంతనే పుణ్యమందించే అరుదైన పవిత్ర తిథులంట... శివయ్యని తలుచుకుంటూ మూడు మునకలేస్తే ముక్కంటి కరుణిస్తాడంట... పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోక భయంకరీ మృత్యకాంత మయాదత్తం ఆహారార్ధం ప్రకల్పయా అంటూ చిటికెడు మట్టి గట్టు నుండి తీసి, నది లోకి వేసి సకుటుంబంగా స్నానమాచరించి రావాలంట... 21-07-2015 వ తేదీ మాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించింది. రాజమండ్రి లో విశ్వేశ్వర ఘాట్ లో శివ కృప వల్ల అంతా సాఫీ గా జరిగింది. అదే రోజు రాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నాము.