గోదారి పుష్కర స్నానం

144 సంవత్సరాల తరువాత వచ్చిన అరుదైన పుష్కరాలంట... గోదారమ్మ లో మునకేసినంతనే పుణ్యమందించే అరుదైన పవిత్ర తిథులంట... శివయ్యని తలుచుకుంటూ మూడు మునకలేస్తే ముక్కంటి కరుణిస్తాడంట...
పిప్పలాదాత్ సముత్పన్నే

కృత్యే లోక భయంకరీ

మృత్యకాంత మయాదత్తం

ఆహారార్ధం ప్రకల్పయా


అంటూ చిటికెడు మట్టి గట్టు నుండి తీసి, నది లోకి వేసి సకుటుంబంగా స్నానమాచరించి రావాలంట...


21-07-2015 వ తేదీ మాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించింది. రాజమండ్రి లో విశ్వేశ్వర ఘాట్ లో శివ కృప వల్ల అంతా సాఫీ గా జరిగింది. అదే రోజు రాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నాము.

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం