Posts

Showing posts from March, 2016

గిరిజమ్మ కరుణించింది

Image
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు!! గత 6-7 నెలలుగా ఈ పిలుపు కోసం ఎదురు చూపు.  ఇన్నాళ్ళకు సాకారమైనదీ కల.  గిరిజాదేవి (బిరజాదేవి) దయతలిచింది, కన్నులపండుగగా అద్భుతమైన దర్శనంతో తనువు, మనసు పులకరించాయి. గుడి 1-3pm మూసివేస్తారంట.  అందుకని, 2-3 గంటలు కోవెల ఆవరణలోనే గడిపే అదృష్టం కూడా దక్కింది. శక్తిపీఠంలో అలా ఉండగలగడంకూడా వరమేకదా!!! ఆలయ ప్రాంగణంలో చాలా శివలింగాలు ఉన్నాయి.  10-15 సహస్రలింగాలు కూడా ఉన్నాయి.  చూసి తీరాల్సిన ఈ అద్భుతాన్ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం సుమా !!! ఇంకొక విశేషమేమిటంటే, ఇది నాభిగయ క్షేత్రం.  గయ, జాజ్ పూర్, పిఠాపురం - ఈ మూడు క్షేత్రాలు కలిపి గయ క్షేత్రాలు. Places visited: నాభి గయ క్షేత్రం - జాజ్ పూర్ - 1:30PM గిరిజా దేవి శక్తి పీఠం - జాజ్ పూర్ - 3PM

లింగోద్భవ అద్భుతం

Image
శివునికి పరమ ప్రీతిపాత్రమైన శివరాత్రినాడు, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శివదర్శనం...  అనన్యసామాన్యమైన ఈ దివ్యానుభూతి నీ కరుణాకటాక్షమే కదా ఈశా. నీ సన్నిధానంలో శివరాత్రినాడు మెసిలానన్న ఆలోచన వస్తే చాలు, ఎంతో అద్భుతంగా ఉంది తెలుసా.  అమ్మ ఎదురుగా ఎంతసేపు నిల్చున్నానో నాకే తెలియదు.  జ్ఞాన ప్రసూనాంబ నన్ను గమనించే ఉంటుందిలే. ఈసారి నిన్ను వెతికే పనిలో దొరికిన మరొక అద్భుతం - గుడిమల్లం లో శ్రీ పరశురామేశ్వర స్వామి.  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏక శిలలో స్వయంభూ గా వెలిసిన అరుదైన, అతి ప్రాచీనమైన క్షేత్రాన్ని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించావు.  వేంకటేశ్వర స్వామి తిరుగాడిన ప్రదేశాలు చూశాం.  ఆయనకు, పద్మావతి అమ్మవారికి వివాహమైన ప్రదేశాలకు, వెళ్ళగలిగామంటే మాటలా ?  వివాహంలో నలుగుపిండి విసిరిన తిరగలి చూశాం.  అంతా నీ లీలలే లే ఈశా !!! శివుని భక్తాగ్రణ్యునితో ఒక సెల్ఫీ... Temples Visited : శ్రీకాళహస్తి - శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ - 7th Mar 2PM and 8th Mar 4AM గుడిమల్లం - శ్రీ పరశురామేశ్వర...