గిరిజమ్మ కరుణించింది

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు!! గత 6-7 నెలలుగా ఈ పిలుపు కోసం ఎదురు చూపు.  ఇన్నాళ్ళకు సాకారమైనదీ కల.  గిరిజాదేవి (బిరజాదేవి) దయతలిచింది, కన్నులపండుగగా అద్భుతమైన దర్శనంతో తనువు, మనసు పులకరించాయి.
గుడి 1-3pm మూసివేస్తారంట.  అందుకని, 2-3 గంటలు కోవెల ఆవరణలోనే గడిపే అదృష్టం కూడా దక్కింది. శక్తిపీఠంలో అలా ఉండగలగడంకూడా వరమేకదా!!!
ఆలయ ప్రాంగణంలో చాలా శివలింగాలు ఉన్నాయి.  10-15 సహస్రలింగాలు కూడా ఉన్నాయి.  చూసి తీరాల్సిన ఈ అద్భుతాన్ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం సుమా !!!

ఇంకొక విశేషమేమిటంటే, ఇది నాభిగయ క్షేత్రం.  గయ, జాజ్ పూర్, పిఠాపురం - ఈ మూడు క్షేత్రాలు కలిపి గయ క్షేత్రాలు.

Places visited:


  1. నాభి గయ క్షేత్రం - జాజ్ పూర్ - 1:30PM
  2. గిరిజా దేవి శక్తి పీఠం - జాజ్ పూర్ - 3PM

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం