లింగోద్భవ అద్భుతం
శివునికి పరమ ప్రీతిపాత్రమైన శివరాత్రినాడు, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శివదర్శనం... అనన్యసామాన్యమైన ఈ దివ్యానుభూతి నీ కరుణాకటాక్షమే కదా ఈశా. నీ సన్నిధానంలో శివరాత్రినాడు మెసిలానన్న ఆలోచన వస్తే చాలు, ఎంతో అద్భుతంగా ఉంది తెలుసా. అమ్మ ఎదురుగా ఎంతసేపు నిల్చున్నానో నాకే తెలియదు. జ్ఞాన ప్రసూనాంబ నన్ను గమనించే ఉంటుందిలే.
ఈసారి నిన్ను వెతికే పనిలో దొరికిన మరొక అద్భుతం - గుడిమల్లం లో శ్రీ పరశురామేశ్వర స్వామి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏక శిలలో స్వయంభూ గా వెలిసిన అరుదైన, అతి ప్రాచీనమైన క్షేత్రాన్ని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించావు.
వేంకటేశ్వర స్వామి తిరుగాడిన ప్రదేశాలు చూశాం. ఆయనకు, పద్మావతి అమ్మవారికి వివాహమైన ప్రదేశాలకు, వెళ్ళగలిగామంటే మాటలా ? వివాహంలో నలుగుపిండి విసిరిన తిరగలి చూశాం. అంతా నీ లీలలే లే ఈశా !!!
శివుని భక్తాగ్రణ్యునితో ఒక సెల్ఫీ...
Temples Visited :
- శ్రీకాళహస్తి - శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ - 7th Mar 2PM and 8th Mar 4AM
- గుడిమల్లం - శ్రీ పరశురామేశ్వర స్వామి - 7th Mar 5PM and 8th Mar 3:30PM
- నాగలాపురం - శ్రీ వేద నారాయణ పెరుమాళ్ - 8th Mar 8AM
- సురుతుపల్లి - శ్రీ పల్లి కొండేశ్వర స్వామి - 8th Mar 10AM
- కారణి - శ్రీ కారణేశ్వర స్వామి - 8th Mar 10:30AM
- నారాయణవనం - శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి - 8th Mar 11:30PM
- నారాయణవనం - శ్రీ పరాశరేశ్వర స్వామి - 8th Mar 12Noon
- అప్పలాయగుంట - శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి - 8th Mar 2PM
- గాజులమాండ్యము - చంద్రమౌళీశ్వర స్వామి - 8th Mar 2:30PM
Comments
Post a Comment