తారా తరణి - ఆది శక్తిపీఠం

ఆది శక్తిపీఠాలు, వాటి వైశిష్ట్యం గురించి చదివి తరించండి.

ఇంతటి మహిమాన్విత ప్రదేశం, మాకు దగ్గరోనే ఉందని తెలిసినదే తడవుగా తల్లి దర్శనానికి వెళ్ళి వచ్చాం.  బరంపురానికి దగ్గరలో ఉన్న తారా తరణి ఆలయ దర్శనం ఒక మధుర జ్ఞాపకం.  గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని దగ్గరగా చూసి పరవశించిపోయాం.

నిజ బనకేశ్వరి ఆలయం ఇంకో విశేషం.  లంకలోని శాంకరీ దేవి ఇక్కడనుంచే తరలి వెళ్ళారట.  శివుడు పెద్ద పాములపుట్ట రూపంలో ఇక్కడ కనబడుతాడు.

ఉజాలేశ్వరుడు కొండగుహలో వెలిసాడు.  వెతికి వెతికి ఆయన జాడ కనిపెట్టి దర్శించుకున్నాం.  హరునికిష్టమైన అభిషేకంతో ఆయన దీవెనలందుకున్నాం.

బారువలోని రుద్రకోటిలింగేశ్వర స్వామిని, జనార్ధనుని ఆలయాన్ని చూసాకా, పొత్తంగిలోని పొత్తేశ్వర స్వామిని, ఉత్తరేశ్వర స్వామిని దర్శించుకున్నాం. అజ్ఞాతవాస సమయంలో గోహత్యాపాతక నిర్మూలనకై పాండవులచే నిర్మించబడిన మహాదేవుని మందిరాలవి. పూర్తి స్థలపురాణం చదివి తరించండి.



Places visited on 4th Jun 2016:
  • తారా తరణి ఆలయం - బరంపురం 10AM
  • నిజ బనకేశ్వరి ఆలయం - 2PM
  • ఉజాలేశ్వరుడు - 3PM
  • రుద్రకోటిలింగేశ్వర స్వామి, బారువ 6:45PM
  • జనార్ధనుని ఆలయం, బారువ - 7PM
  • పొత్తేశ్వర స్వామి, పొత్తంగి - 8PM
  • ఉత్తరేశ్వర స్వామ, పోత్తంగి - 8:30PM

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం