నవ నారసింహులు

ఎదురుచూపుల్లో ఎంత ఆత్రుత ఉంటుందో... సాకారమయ్యాకా అంత ఆనందం కలుగుతుంది...
ఎన్నాళ్ళో ఊరించి ఊరించి, నారసింహుడు మాపై ఇంత ప్రేమ కురిపించాడు... నైవేద్యంగా మా మనసులు గైకొన్నాడు ఆ కరుణామూర్తి. 

వైకుంఠ ఏకాదశి నాడు ఆ స్వామిని తనివితీరా చూడగలగడం జన్మజన్మల పుణ్యఫలం. ఉగ్రస్థంబం పైకి చేరి కొండలనిండా నిండి ఉన్న నారాయణుని మదినిండా నింపుకున్నాం. నవ నారసింహులను కళ్ళతోనూ మనసుతోనూ చూసి ఆనందించాం.

ఇంత గొప్ప దర్శనాలను ఆస్వాదిస్తూ ఉండగానే, ఇంకొక అద్భుతం కళ్ళముందు ఆవిష్క్రతమైంది. నల్లమల అడవుల్లో, కొండ గుహలో వెలిసిన సాంబయ్యని చూస్తూ మైమరిచిపోయాం. గబ్బిలాలను తరుముతూ గుహలోకి వెళ్ళి, కొండబండల క్రిందకి ప్రాకుతూ వెళ్ళి, ఉల్లెడ మల్లేశ్వరుని చూస్తూ మనసు చేసిన నాట్యం వర్ణించలేం.  ”నమశ్శివాయ" అన్న మా పంచాక్షరీ మంత్రోఛ్ఛారణ గుహల్లో ప్రతిధ్వనించింది.

యాగంటి బసవన్న గూర్చి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారని విన్నాం కదా... ఆ శివ సేవా దురంధరుడిని చూసి తరించాం.  తరువాత ఏకశిలపై వెలసిన ఉమామహేశ్వరులని చూసి పరవశించిపోయాం.  జీవితాంతం నెమరు వేసుకోడానికి సరిపడే జ్ఞాపకాలను పెట్టెల్లో సర్దుకొని తిరుగుప్రయాణమయ్యాం.

7th Jan 2017
పావన నరసింహ - 4PM
భార్గవ నరసింహ - 6PM
లక్ష్మీ నరసింహ - 8PM

8th Jan 2017
ఉగ్ర నరసింహ (అహోబిల నరసింహ) - 6AM
జ్వాలా నరసింహ - 10AM
ఉగ్ర స్థంభం - 1PM
ప్రహ్లాద బడి - 2:30PM
మాలోల నరసింహ - 3PM
క్రోధ (వరాహ) నరసింహ - 3:30PM
కారంజ నరసింహ - 4PM
ఛత్రవట నరసింహ - 4:30PM
యోగానంద నరసింహ - 5PM

9th Jan 2017
శ్రీ ఉల్లెడ మల్లేశ్వర స్వామి - 11:30AM
యాగంటి ఉమా మహేశ్వరుడు - 6 PM
చౌడేశ్వరీ దేవి (నందవరం) - 7:30PM

12th Jan 2017
పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి- చెరువుగట్టు - 4PM
ఛాయా సోమేశ్వర స్వామి - పానగల్లు, నల్గొండ - 5PM
శ్రీ వేంకటేశ్వర స్వామి - పానగల్లు - 6:30PM
పచ్చల సోమేశ్వర స్వామి - పానగల్లు - 7PM

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం