Posts

Showing posts from August, 2018

మహాదేవా !!!

మహాదేవా అభిషేకానికి నీళ్ళు తీసుకుని గుడిమెట్లు ఎక్కాను. కానీ.. పవిత్ర గంగ నిన్ను ప్రతిక్షణం అభిషేకిస్తుంది కదా !!! మహాదేవా! హలాహలం వేడితో నువ్వు తపిస్తున్నావని, మంచి గంధలేపనం వేద్దాం అనుకున్నాను. కానీ... చల్లదనంకి ప్రతిరూపమైన హిమశిఖరమే, నీ వాసం, నీ శిరసే శశాంకుడి నివాసం. మహాదేవా! మణిమాణిక్యాలతో నిన్ను పూజిద్దాం అనుకున్నాను. అన్నట్టు, మణిరాజు అయిన వాసుకి, నీ మెడలో కంఠాభరణం కదా మహాదేవా! వేద స్తోత్రాలతో నిన్ను స్తుతిద్దామని అనుకున్నాను. వేదాలనే చెప్పిన ఆదిగురువు దక్షిణామూర్తివి నీవేగా . మహాదేవా! కమ్మని సంగీతంతో నిన్ను పరవశింపచేద్దాం అని అనుకున్నాను. తరచి చూస్తే, సంగీతానికి బీజమైన ఓంకారాం, నీ ఢమరుకనాదమే !!! మహాదేవా! శాస్త్రీయనాట్యంతో నిన్ను అలరిద్దాం అనుకున్నాను.  నాట్యానికే ఆచార్యుడివైన నటరాజు నువ్వేగా . మహాదేవా! షడ్రుచులతో నీకు నైవేద్యం పెట్టి మురిసిపోద్దాం అనుకున్నాను. అయితే, అందరికి ఆహారాన్ని ఇచ్చే అన్నపూర్ణయే, నీ అర్ధశరీరం మహాదేవా! ఉపచారాలతో నీకు సేవ చేసే భాగ్యం పొందుదాం అనుకున్నాను. ఆ పనికోసమే పుట్టిన  శిలాదుడి పుత్రుడైన, బసవ నందీశ్వరుడు నీ వద్దే ...

చాముండీ దేవి - పంచలింగ క్షేత్రాలు

Image
బెంగళూరు వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం - మైసూరు వెళ్లి చాముండీ శక్తి పీఠం చూసి వచ్చాము.  అనిర్వచనీయమైన ఆనందం -  అదృష్టం కొద్దీ ఎక్కువ జనం లేకపోవడంతో చాలా సేపు అమ్మవారిని చూస్తూ ఉండిపోయాం.  పక్కనే స్వయంభూ గా వెలసిన మహాబలేశ్వర స్వామిని చూసి పొంగిపోయాం.  అక్కడి నుంచి తలకాడు అనే గ్రామానికి మా ప్రయాణం.  మార్గమధ్యంలో, కావేరీ తీరంలో వెలసిన శ్రీ మహాలక్ష్మీ సమేత గుంజా నరసింహస్వామిని కళ్లారా దర్శించి, తలకాడు చేరుకున్నాం.  పంచలింగ క్షేత్రాలు అయిన  వైద్యనాథేశ్వర స్వామి, పాతాళేశ్వర స్వామి, మరాళీశ్వర స్వామి దర్శనాలు అద్భుతం.   కీర్తి నారాయణ దేవాలయంలో, విష్ణుమూర్తి ప్రసన్నంగా దర్శనం ఇచ్చారు.  తిరుగు ప్రయాణం శ్రీరంగపట్టణానికి.  మార్గమధ్యంలో సోమేశ్వరపుర లో, కేశవ స్వామి ఆలయం అలనాటి శిల్పకళకు, దైవభక్తికి, శాస్త్ర నైపుణ్యానికి ఒక నిదర్శనం.  ఆ మహాద్భుతాన్ని చూసాకా, శ్రీరంగపట్టణ చేరుకున్నాం.  అక్కడ, చాముండీదేవి కి చెల్లెలు అయిన నిమిషాoబ అమ్మవారిని చూసాము.  శ్రీ చక్రంతో వెలసిన ఈ అమ్మవారు ...

శతగాయత్రి

బ్రహ్మ గాయత్రి :- 1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.// 2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.// 3. సురారాధ్యాయ విద...

భగవద్గీత 18 అధ్యాయాల వీడియోలు

_1వ అధ్యాయము – 1st Chapter_ https://youtu.be/R8Z69FtjX_U _2వ అధ్యాయము – 2nd Chapter_ https://youtu.be/zi-FPqF3rFQ _3వ అధ్యాయము – 3rd Chapter_ https://youtu.be/M_URKV_1vyM _4వ అధ్యాయము – 4th Chapter_ https://youtu.be/0nmyvkL7Udc _5వ అధ్యాయము – 5th Chapter_ https://youtu.be/oHv6Wp3ZuWc _6వ అధ్యాయము – 6th Chapter_ https://youtu.be/kxmSL-WIQKo _7వ అధ్యాయము – 7th Chapter_ https://youtu.be/EhQVNBlb_zs _8వ అధ్యాయము – 8th Chapter_ ...

తెలుగు విలువలు

ధర్మం/నీతి/విలువలు  బోధించే 79 పుస్తకాలు, 14 ప్రవచనాలు ఒకేచోట ఉచితంగా తెలుగులో ------------------------------------------------            పుస్తకాలు చాణక్య నీతి సూత్రాలు   http://bit.ly/Dharmam-1 విదురనీతి   http://bit.ly/Dharmam-2 బోధాయన ధర్మ సూత్...

ప్రవర యొక్క అర్ధం

చతుస్సాగర పర్యంతం (మానవ పరిభ్రమణానికి నలువైపులా కల మహాసముద్రాల అంచుల వరకూ)...  గో బ్రాహ్మణేభ్య శుభం భవతు (సర్వాబీష్ట ప్రదాయిణి అగు..గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ).... ×××××××. ఋషేయ ప్రవరాన్విత.. (మా వంశమునకూ..మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ.. త్యాగే నైకే అమృతత్త్వ మానశుః......  అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడనై.. ×××××× గోత్రః (మా గోత్రమునకూ..) ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ.....  (మా శాఖకూ..అందలి శాస్త్ర మర్మంబులకు..) శ్రీ * శర్మ నామధేయస్య  ( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో..వేదాధ్యయనాది వైదిక క్రతువులతో.. 1. స్నానము 2. సంధ్య 3. జపము 4. హోమము 5. స్వాధ్యాయము 6. దేవ పూజ 7. ఆతిధ్యము 8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ..త్రివిధాగ్నులు... 1.కామాగ్ని 2.క్రోధాగ్ని 3.క్షుద్రాగ్ని.. అనే త్రివిధాగ్నులను అదుపులో(సమస్థితిలో)...