మహాదేవా !!!
మహాదేవా అభిషేకానికి నీళ్ళు తీసుకుని గుడిమెట్లు ఎక్కాను.
కానీ.. పవిత్ర గంగ నిన్ను ప్రతిక్షణం అభిషేకిస్తుంది కదా !!!
మహాదేవా! హలాహలం వేడితో నువ్వు తపిస్తున్నావని, మంచి గంధలేపనం వేద్దాం అనుకున్నాను.
కానీ... చల్లదనంకి ప్రతిరూపమైన హిమశిఖరమే, నీ వాసం, నీ శిరసే శశాంకుడి నివాసం.
మహాదేవా! మణిమాణిక్యాలతో నిన్ను పూజిద్దాం అనుకున్నాను.
అన్నట్టు, మణిరాజు అయిన వాసుకి, నీ మెడలో కంఠాభరణం కదా
మహాదేవా! వేద స్తోత్రాలతో నిన్ను స్తుతిద్దామని అనుకున్నాను.
వేదాలనే చెప్పిన ఆదిగురువు దక్షిణామూర్తివి నీవేగా .
మహాదేవా! కమ్మని సంగీతంతో నిన్ను పరవశింపచేద్దాం అని అనుకున్నాను.
తరచి చూస్తే, సంగీతానికి బీజమైన ఓంకారాం, నీ ఢమరుకనాదమే !!!
మహాదేవా! శాస్త్రీయనాట్యంతో నిన్ను అలరిద్దాం అనుకున్నాను.
నాట్యానికే ఆచార్యుడివైన నటరాజు నువ్వేగా .
మహాదేవా! షడ్రుచులతో నీకు నైవేద్యం పెట్టి మురిసిపోద్దాం అనుకున్నాను.
అయితే, అందరికి ఆహారాన్ని ఇచ్చే అన్నపూర్ణయే, నీ అర్ధశరీరం
మహాదేవా! ఉపచారాలతో నీకు సేవ చేసే భాగ్యం పొందుదాం అనుకున్నాను.
ఆ పనికోసమే పుట్టిన శిలాదుడి పుత్రుడైన, బసవ నందీశ్వరుడు నీ వద్దే ఉన్నాడు
మహాదేవా!
ఇక నిన్ను ఎలా పూజించాలో ఎలా సేవించాలో ఎలా తరించాలో తెలియట్లేదు. ప్రభూ!
నాది అంటూ ఏముంది నాలోన?
నాలో వెలుగుతున్న జ్యోతి నాది కాదు, నాది అని భ్రమించే దేహం నాది కాదు,
నాది అనుకునే "నా అహం" నాది కాదు, నాలో చెలరేగుతున్న భావాలు కూడా నావి కాదు.
సత్యం తెలిసింది
"అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ".

Comments
Post a Comment