చాముండీ దేవి - పంచలింగ క్షేత్రాలు

బెంగళూరు వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం - మైసూరు వెళ్లి చాముండీ శక్తి పీఠం చూసి వచ్చాము.  అనిర్వచనీయమైన ఆనందం -  అదృష్టం కొద్దీ ఎక్కువ జనం లేకపోవడంతో చాలా సేపు అమ్మవారిని చూస్తూ ఉండిపోయాం.  పక్కనే స్వయంభూ గా వెలసిన మహాబలేశ్వర స్వామిని చూసి పొంగిపోయాం. 

అక్కడి నుంచి తలకాడు అనే గ్రామానికి మా ప్రయాణం.  మార్గమధ్యంలో, కావేరీ తీరంలో వెలసిన శ్రీ మహాలక్ష్మీ సమేత గుంజా నరసింహస్వామిని కళ్లారా దర్శించి, తలకాడు చేరుకున్నాం.  పంచలింగ క్షేత్రాలు అయిన  వైద్యనాథేశ్వర స్వామి, పాతాళేశ్వర స్వామి, మరాళీశ్వర స్వామి దర్శనాలు అద్భుతం.   కీర్తి నారాయణ దేవాలయంలో, విష్ణుమూర్తి ప్రసన్నంగా దర్శనం ఇచ్చారు. 

తిరుగు ప్రయాణం శ్రీరంగపట్టణానికి.  మార్గమధ్యంలో సోమేశ్వరపుర లో, కేశవ స్వామి ఆలయం అలనాటి శిల్పకళకు, దైవభక్తికి, శాస్త్ర నైపుణ్యానికి ఒక నిదర్శనం.  ఆ మహాద్భుతాన్ని చూసాకా, శ్రీరంగపట్టణ చేరుకున్నాం.  అక్కడ, చాముండీదేవి కి చెల్లెలు అయిన నిమిషాoబ అమ్మవారిని చూసాము.  శ్రీ చక్రంతో వెలసిన ఈ అమ్మవారు చక్కటి దర్శనం ప్రసాదించింది.

అనిర్వచనీయమైన ఆనందాన్ని మా సొంతం చేసిన శ్రీ రంగనాథుని దర్శనం ఈ జీవితకాల జ్ఞాపకం.  స్వామియొక్క మోహన రూపాన్ని, విరాట్ స్వరూపాన్ని, ప్రసన్న వదనాన్ని, లక్ష్మీ దేవి సొమ్ములైన ఆ పావన పాదాలని... ఎంత సేపు చూసినా, ఎన్ని సార్లు చూసినా... తనివి తీరదు కదా... 

ఏమి ఈ భాగ్యం !!! ఏమి ఈ కరుణ !!! ఇంత అద్భుతమైన దర్శనాలు ఇచ్చిన శివ కేశవులకు తిరిగి ఏమివ్వగలం ?  మన మనఃపుష్ప నివేదనం తప్ప !!!



Temples Visited on 25-Aug-2018:
చాముండీ శక్తి పీఠం, మహాబలేశ్వర స్వామి  - 8AM
మహాలక్ష్మీ సమేత గుంజా నరసింహస్వామి - 10AM
పంచలింగ క్షేత్రాలు, కీర్తి నారాయణ - తలకాడు - 12 noon
కేశవ స్వామి ఆలయం - సోమేశ్వరపుర - 1 PM
నిమిషాoబ అమ్మవారు, శ్రీరంగపట్టణ - 2PM
శ్రీ రంగనాథ స్వామి, శ్రీరంగపట్టణ - 4PM

Comments

Post a Comment

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం