మదురై - రామేశ్వరం

ఏమి నా భాగ్యం.. గత ఏడాదినుంచి ఎన్నోసార్లు వెళ్లాలని ప్రణాళికలు కూడా వేసుకున్నా, కుదరక వెళ్లలేకపోయిన అద్భుత ఆలయమాలల సందర్శనాభాగ్యం ఎట్టకేలకు దొరికింది. ఎన్ని క్షేత్రాలు, ఎన్ని అద్భుత దర్శనాలు, ఎంత ఆనందం, ఏమి పారవశ్యం !!! మదురై మరియు రామేశ్వరం - రెండు ప్రదేశాలలో శివయ్య రెండు చేతులతో హత్తుకొని లోనికి రమ్మని పిలిచినట్టు ఎంత చక్కటి దర్శనాలు !!! తిరుచెంగోడు లో స్వయంభూ గా వెలసిన అర్ధనారీశ్వర స్వామిని దర్శించుకున్నాం. మార్గశిరమాసంలో ఉదయం 7 వరకూ, మరకతలింగ దర్శనం కూడా ఉంటుంది, అదృష్టవశాత్తూ ఆ దర్శన భాగ్యం కూడా దక్కింది. ఇదే ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి కూడా స్వయంభూ గా వెలిసాడు. ఆయనని కూడా చక్కగా దర్శించుకొని ప్రయాణం కొనసాగించాం. మదురై దగ్గరలో అళగర్ కొండమీద ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం ఎంతో బాగుంది. చక్కగా స్వామి ముందు రెండు నిముషాలు కూర్చోనిచ్చి పంపించారు. ఇది 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటి. దర్శనం చేసుకొని వచ్చేసరికి కొండ దిగువన ఉన్న పెరుమాళ్ ఆలయం తెరిచిల...