తిరుమలవాసా…. శ్రీ జగదీశా
ఏమి మా భాగ్యం. మా జన్మ ధన్యం.
ఏమి మా ఆనందం. మా మది నందనందనం.
స్వామిని ఇంత దగ్గరగా ఈ జన్మలో చూస్తానని ఊహించలేదు. గర్భగుడి దాకా వెళ్ళాకా, కళ్ళారా నిలువెత్తు విగ్రహాన్ని చూస్తూ పరవశంతో మనసు గోవిందుని వశమైపోయింది. మళ్ళీ మళ్ళీ అవకాశం దొరకదేమో అని ఆపాదమస్తకం కళ్ళతో తడిమేసిన నావల్ల శ్రీనివాసుడు ఇబ్బంది పడ్డాడేమో అని కాస్త సిగ్గేసింది. ఇంతలోనే నాలాంటి వాళ్ళు ఎన్ని కోటానుకోట్లో కదా, ఆయనకి అలవాటేలే అని సర్దిచెప్పుకున్నాను. చిన్న చిరునవ్వుతో పలకరించాడాయన, ఎంత గొప్ప మనసు!
Comments
Post a Comment