అరుణాచల శివ
అరుణగిరి ప్రదక్షిణం - ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అదృష్టం ఇన్నాళ్ళకి మమ్మల్ని వరించింది. అపీతకుచాంబ అమ్మవారు, అరుణాచలేశ్వరుడు కలిసి ఆశీర్వదిస్తే, తీరని కోరిక ఏముంటుంది ? 14 కిలోమీటర్లు, 11 శివాలయాలు, చక్కని సాయంత్రం నడక - ఇలా అందంగా సాగింది, అరుణగిరి పరిక్రమ. అష్ట దిక్కులా, అష్ట దిక్పాలకులు ప్రతిష్టించిన అష్ట శివాలయాలు , వాటితోపాటు, సూర్య లింగం, చంద్ర లింగం, ఇంకా ఆది అన్నామలై ఆలయం. అన్నీ దర్శించుకొని, ప్రశాంతంగా తిరిగి రావడానికి సుమారుగా 5 గంటలు పట్టింది.
తెల్లవారగానే అద్భుత దర్శనం. పంచభూత శివాలయాల్లో అగ్ని లింగం అయిన, అరుణాచల శివుడు చక్కటి దర్శనం ప్రసాదించాడు. కరోనా కాలంలో మొదటి క్షేత్ర దర్శనం కావడంతో, కొంత అనుమానం, భయం ఉన్నమాట అంగీకరించవలసిన వాస్తవం. కానీ, అన్నీ పటాపంచలు చేస్తూ, చక్కటి దర్శనం దొరికింది. కొంచెం కూడా తోపులాటలు లేవు. ప్రశాంతంగా దర్శనం అయ్యింది. ఇంకా ఆలయదర్శనాలు చేసుకోవడానికి చక్కటి ప్రోత్సాహం దొరికింది. అమ్మవారి దర్శనం కూడా చేసుకొని, తిరువారంగం బయలుదేరాం.
తిరువారంగంలో రంగనాథ స్వామి దర్శనం అద్భుతం. ఎంతసేపు ఆయన చెంత ఉన్నామో... చాలాసేపు, స్వామి విరాట్ రూపాన్ని అణువణువూ జుర్రేసామంటే నమ్మండి. అక్కడినుంచి తిరుక్కోవిలూర్ వెళ్లాం. అక్కడ మొదటిగా వామనమూర్తిని చక్కగా దర్శించుకున్నాం. తరువాత, పక్కనే ఉన్న వీరాటీశ్వరస్వామి దగ్గరకి వెళ్లాం. ఇది ఒక పాడల్ పెట్ర స్థలం. స్వామి చెంత హాయిగా కాసేపు కూర్చొని, అమ్మవారిని కూడా దర్శించుకొని, తిరుగుప్రయాణం అయ్యాం.
గిరి ప్రదక్షిణం చేసిన ఆనందంలో...
Places visited:
12 Dec - Arunagiri parikrama - 6PM to 11PM
13th Dec
Comments
Post a Comment