జీవన కాలమ్
*గురజాడ అప్పారావు గారు వెళ్లిపోతున్నారని తెలిసినప్పుడు, కుటుంబ సభ్యులు వైద్యుడిని, పిలిపించారట.* *అప్పారావు గారు వైద్యుడిని చూసి.. ‘తాంబూలం వేసుకోవాలని ఉందయ్యా’ అన్నారట.* *వైద్యునికీ పరిస్థితి తెలుస్తోంది. తాంబూలం ఇచ్చారట. వేసుకున్న తర్వాత ఆయన శాశ్వతంగా వెళ్లిపోయారు.* *మొన్న అప్పారావుగారి శత వర్ధంతి సభలో ఆయన మునిమనుమడి భార్య, ఈ విషయాన్ని చెప్పారు.* *ప్రముఖ రచయిత కుష్వంత్‌సింగ్ తల్లి 94 సంవత్సరాలు బతికారు. ఆమె పక్కన కూర్చుని కుష్వంత్‌సింగ్ తల్లిని అడిగారట- ‘ఏం కావా’లని.* *’ఓ పెగ్గు స్కాచ్ కావాల’న్నారట ఆమె.* *ఒంగోలులో మా మిత్రుడి తండ్రిని, చివరి రోజుల్లో నేను చూశాను. చాలా నెలల తర్వాత మా మిత్రుడు ఫోన్ చేశాడు - నాన్న వెళ్లిపోయాడని.* *చివరి క్షణాల్లో కొడుకుని పిలిచి - ‘ఓ గ్లాసుతో బ్రాందీ కావాలన్నారట. తాగి, ఒక సిగరెట్టు కాల్చి హాయిగా కన్నుమూశాడు.* *మృత్యువుని మజిలీగా, గుర్తు పట్టడం గొప్ప సంస్కారం.* *మృత్యువుని సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా గొప్ప సంస్కారం. దుఃఖం ఒక దృక్పథం. నిర్వేదం ఒక బలహీనత.* *భారతీయ సంస్కృతి మనిషి పుట్టినప్పటి నుంచీ, ఒక ఆలోచనకు మనల్ని తర్ఫీదు చేస్తుంది - ...