Posts

అష్టాదశ పురాణాలు

మనం అనేక సందర్భాల్లో ‘అష్టాదశ పురాణాలు’ అని వింటూ ఉంటాం. అయితే ఆ 18 పురాణాల పేర్లూ ఒకపట్టాన గుర్తుకు రావు. ఒకవేళ అన్నింటి పేర్లూ తెలిసినా, ఏ పురాణంలో ఏముందో తెలియని పరిస్థితి. అనంతంగా ఉన్న ఈ పౌరాణిక విజ్ఞానాన్ని, అపారమైన వేదరాశిని వేదవ్యాసుడే అంశాల వారీగా విభజించాడు. అందుకే విష్ణుసహస్రనామంలో వ్యాసాయ విష్ణురూపాయ.. వ్యాసరూపాయ విష్ణవే అని ఉంటుంది. వేదవ్యాసుడు పురాణాలను రచిస్తే, వాటిని మహాపౌరాణికుడు సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు. వారి ద్వారా ఇవి లోకానికి వెల్లడయ్యాయి. ఎంతో విస్తారమైన ఈ పురాణాలను మనం చదవలేకపోయినప్పటికీ, అసలు ఆ పురాణాలేమిటి, ఏ పురాణంలో ఏముందో రేఖామాత్రంగా అయినా తెలుసుకోగలిగితే అవకాశం ఉన్నప్పుడు విపులంగా తెలుసుకోవచ్చు.   18 పురాణాల పేర్లు :  1.⁠ ⁠మత్స్యపురాణం  2.⁠ ⁠కూర్మపురాణం  3.⁠ ⁠వామన పురాణం  4.⁠ ⁠వరాహ పురాణం  5.⁠ ⁠గరుడ పురాణం  6.⁠ ⁠వాయు పురాణం  7.⁠ ⁠నారద పురాణం  8.⁠ ⁠స్కాంద పురాణం  9.⁠ ⁠విష్ణుపురాణం 10.⁠ ⁠భాగవత పురాణం 11.అగ్నిపురాణం 12.⁠ ⁠బ్రహ్మపురాణం 13.⁠ ⁠పద్మపురాణం 14.⁠ ⁠మార్కండేయ పురాణం 15.⁠ ⁠బ్రహ్మవైవర్త పురాణం 16.లింగపురాణం 17.బ్రహ్మాండ పురాణం 18.⁠ ⁠భవిష్యపురా...

ఆత్మానుభూతి

 అనన్య భక్తి భగవంతుడు సృష్టించిన పదార్ధాల తో తిరిగి భగవంతుని ఆరాధించటం కాకుండా, మన మనో పుష్పాన్ని భగవంతునికి  అర్పించటమే అనన్య భక్తి! ఈ మనో పుష్పం శుద్ధమై ఉండాలి.! దానికి ముందు ఇంద్రియ నిగ్రహం, సర్వ భూతదయ, శాంతి, క్షమా అహింసలు, తపము, ధ్యానం, సత్యం ఇవన్నీ సాధించాలి. నిరంతరం తపన, సాధన చేయాలి. ప్రతీ జడ, జీవ పదార్ధము పరమాత్మ స్వరూపమే అన్న దాన్ని అనుభూతి పొందాలి. విశ్వం అంతటా పరమాత్మ చైతన్యమే నిండి ఉంది అని తెలుసు కొంటేనే ఆ శక్తి మనలో, జడ, జంతు జీవాలలో ఉంది అని అర్ధం అవుతుంది. మనసు ఎపుడు కూడా బైటకే, బాహ్య వస్తువుల వైపే పరుగులు తీస్తూ ఉంటుంది. అలాంటి మనసుని శుద్ధి చేసుకొని అంతర్ముఖం చేయాలి. మనసు, బుద్ధి ఏకమై ఆత్మలో లయం అవ్వాలి...      లేదా మనసే ఆత్మగా ప్రకాశించాలి. చిత్త శుద్ధి పొందిన మనసుని ఆత్మలో ప్రతిష్టించాలి!. ఇలాంటి మనో పుష్పాన్నే భగవంతునికి సమర్పించాలి! ఇదే అనన్య భక్తి, ఆత్మానుభూతి. గృహస్తు అయినా, బ్రహ్మ చారి అయినా, సన్యాసి అయినా మనసు శుద్ధి చేసుకొంటే కానీ భక్తుడు కాలేడు. చిత్తశుద్ధి లేని పూజ పరమాత్మ స్వీకరించడు.ముక్తి పొందాలంటే భక్తి కావాలి.భక్తి అంటే అనన్య భక...

మౌనం 🤫

మౌనం ఒక మానసిక నిశ్శబ్దం. మాట ఓ భౌతిక శబ్దం. మౌనం ఓ సమస్యకు పరిష్కారం. మాట ఒక సమస్యకు కారణం. మాట హద్దులు దాటితే యుద్ధం. మౌనం హద్దులు దాటితే ఆత్మ జ్ఞానం.  కొన్నిటికి సమాధానం మౌనం. కొన్నిటికి సమాధానం మాట. మాట మౌనం రెండు అవసరం. వాటిని వాడే విధానం తెలుసుకోవాలి.  అది తెలిసిన వారు ప్రతిక్షణం ఆనందంగా ఉండగలరు. మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు. నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ విజ్రుంభణను ఆపడం. మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియమంటారు. మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం. మౌనమంటే - నిరంతర భాషణ. చింత, చింతన లేని తపస్సు.  అఖండ ఆనందపు ఆత్మస్థితి. విషయ శూన్యావస్థ. యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ ఆదిశంకరులు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం.  అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అంద...

హృదయార్పణం

మనిషి తనకు మానవజన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు... పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో,పుష్పమో,ఫలమో,  జలమో సమర్పించుకుంటూ ఉంటాడు.  ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమోగానీ, అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా?  ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు. భగవంతుడిదే ఈ యావత్‌సృష్టి. అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే. కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు. పూర్వం ఒక యోగి భగవంతుణ్ని అర్చించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది. పూజలో ఒక్కొక్క ఉపచారాన్నీ చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు- 'పరమేశ్వరా!  నీవు బ్రహ్మాండమంతా నిండిఉన్నావు. కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలి?  అన్నింటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి?  నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లెందుకు? పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా? నిత్య నిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి? ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి?  గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అ...

జీవన కాలమ్

*గురజాడ అప్పారావు గారు వెళ్లిపోతున్నారని తెలిసినప్పుడు, కుటుంబ సభ్యులు వైద్యుడిని, పిలిపించారట.*  *అప్పారావు గారు వైద్యుడిని చూసి.. ‘తాంబూలం వేసుకోవాలని ఉందయ్యా’ అన్నారట.*  *వైద్యునికీ పరిస్థితి తెలుస్తోంది. తాంబూలం ఇచ్చారట. వేసుకున్న తర్వాత ఆయన శాశ్వతంగా వెళ్లిపోయారు.* *మొన్న అప్పారావుగారి శత వర్ధంతి సభలో ఆయన మునిమనుమడి భార్య, ఈ విషయాన్ని చెప్పారు.* *ప్రముఖ రచయిత కుష్వంత్‌సింగ్ తల్లి 94 సంవత్సరాలు బతికారు. ఆమె పక్కన కూర్చుని కుష్వంత్‌సింగ్ తల్లిని అడిగారట- ‘ఏం కావా’లని.*  *’ఓ పెగ్గు స్కాచ్ కావాల’న్నారట ఆమె.*  *ఒంగోలులో మా మిత్రుడి తండ్రిని, చివరి రోజుల్లో నేను చూశాను. చాలా నెలల తర్వాత మా మిత్రుడు ఫోన్ చేశాడు - నాన్న వెళ్లిపోయాడని.* *చివరి క్షణాల్లో కొడుకుని పిలిచి - ‘ఓ గ్లాసుతో బ్రాందీ కావాలన్నారట. తాగి, ఒక సిగరెట్టు కాల్చి హాయిగా కన్నుమూశాడు.* *మృత్యువుని మజిలీగా, గుర్తు పట్టడం గొప్ప సంస్కారం.* *మృత్యువుని సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా గొప్ప సంస్కారం. దుఃఖం ఒక దృక్పథం. నిర్వేదం ఒక బలహీనత.* *భారతీయ సంస్కృతి మనిషి పుట్టినప్పటి నుంచీ, ఒక ఆలోచనకు మనల్ని తర్ఫీదు చేస్తుంది - ...

ధర్మమే గెలుస్తుంది

*_అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని..._* *_అది తప్పు...! ధర్మం దానంతట అదే గెలవదు..!_* *_నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి..!_* *_అర్థం కాలేదా...?_* *_ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాలలోకి తొంగి చూడు..!_* *_కృత యుగం లో…_* *_తన భక్తుడైన ప్రహ్లాదున్ని కాపాడడానికి ధర్మ సంస్థాపనకు భక్తుడి కోసం భగవంతుడు ఉన్నాడు. అని చెప్పడం కోసం, సత్యాన్ని స్థాపించడం కోసం, అణువు అణువు లో భగవంతుడు నృసింహ రూపంలో వ్యాపించి అహోబిల క్షేత్రంలో  ఒక స్తంభం నుండీ వచ్చాడు._* *_హిరణ్య కశ్యపుడిని సంహరించాడు._* *_ధర్మాన్ని, సత్యాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఎన్నో రూపాలు ధరించి, కష్టాలు పడుతూ ఉంటాడు._* *_త్రేతాయుగంలో…_* *_రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు,_* *_సరేలే ధర్మమే గెలుస్తుంది కదా, తన సీత తిరిగి వస్తుంది అని…  రాముడు చేతులు కట్టుకొని గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు._* *_రావణాసురుడి మీద ధర్మయుద్ధం ప్రకటించాడు._* *_ఆ రాముడికి అఖండ వానరసైన్యం తోడై ధర్మం వైపుకు అడుగులు వేశారు._* *_ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి. తన భుజాలను, తొడ భాగాల చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి._*...

కర్మ ఫలం

కర్మ ఫలం..తప్పదు ఎవరికైనా అనుభవించక..! మన పాప కర్మే గ్రహ రూపంలో వచ్చి బాధిస్తుంది..! కర్మ బలీయమైనది..! రాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు.  కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు - మంత్రవేత్త రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు  ఇంకోకవైపు నుంచి - దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. తక్షకుడు కూడా బ్రహ్మణవేషధారియై, కశ్యపుని చూసి "మహామహితాత్మా! తమరెవరు?  ఎచ్చటికీ పయనం?" అని అడిగాడు. "ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే,  నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడుతున్నాను" అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు. "అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిన్మహరాజుని కాటూవేయబోయేది ఏదో నీటిపామో - బురద పామో అనుకుంటున్నావా?  సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు - తక్షకుడే స్వయంగా అయితేనో?"  "తక్షకుడైనా కానిమ్ము!  అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము!  నా దగ్గర ఉన్నదిగారడీ వాడి పాము మంత్రమో -  విషకీటక మంత్రమో అనుకుంటున్నావా?"  అని ప్రశ్నించాడు కశ్యపుడు. అంతగొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని" అని నిజరూపం చూపి...