నారాయణేశ్వర స్వామి

ఇంటికి దగ్గరలో ఇంత అద్భుతమైన శివాలయం ఉందని ఇన్నాళ్లూ తెలియలేదు.  ఇంత ఆలస్యమైనందుకు కించిత్తు బాధగా అనిపించినా, వెళ్లి దర్శనం చేసుకోగానే మా అదృష్టానికి పొంగింపోయాం.  నారాయణేశ్వర స్వామి - ఆ పేరులోనే దివ్య మహత్తు ఉంది కదూ...  వినడానికి, ఉచ్ఛరించడానికి ఎంత బాగుందో.   శివస్య హృదయం విష్ణు : - అన్న మంత్రం చదివినట్టే ఉంది.

పచ్చటి కొండల్లో వెలసిన శివుడు రమ్మని పిలిచినట్టు , అప్పటికప్పుడు బయలుదేరి వెళ్లివచ్చాం.  మేము ఇంతవరకూ చూసిన శివ లింగాలలో ఇదే అతి చిన్న శివ లింగం.   బుజ్జి శివుడు అని పిలుచుకొని మురిసిపోయాం.   శివరాత్రికి  చక్కటి ఏర్పాట్లు  జరుగుతున్నాయి.  వీలైతే.. కాదు కాదు.. వీలు చేసుకొని, ముక్కంటిని చూసి తరించండి.

Places visited:

నారాయణేశ్వర స్వామి - గుడిలోవ, ఆనందపురం - 19th Feb 10:30AM

శివ సన్నిధి లో
  

Comments

  1. Nenu Inter lo vunnappudu okasari vellanu.. Adbhutamga vuntundi.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం