బెంగళూరు టెంపుల్ స్ట్రీట్
కాడు మల్లిఖార్జున స్వామి వారి ఆలయం గురించి విన్ననాటినుంచి ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నా. ఆ స్వయంభూ లింగం కళ్ళారా చూసి పరవశించి పోయాం. ఎంత సేపు చూసినా, ఇంకా చూడాలనిపించే ఈ మల్లయ్యని ఎంత సేపు చూస్తే తనివి తీరుతుంది ? ఎన్ని సార్లు చూస్తే చూపు తిరుగుతుంది ? అయ్యోరి పక్కనే ఉన్న అమ్మోరు ప్రశాంతంగా నన్నే చూస్తున్నట్టుగా అనిపించింది. బొజ్జయ్య కూడా ఎంతో బుజ్జిగా ఉన్నాడో..
పక్కనే స్వయంవ్యక్త విష్ణు క్షేత్రం ఉంది, లక్ష్మీ నారసింహుడు వేంచేసి ఉన్న ఆ ఆలయం లో దర్శనం ఒక అందమైన అనుభూతి. గంగమ్మ ఆలయం కూడా పక్కనే ఉంది. అద్భుతమైన నంది క్షేత్రం కూడా ఉంది.
Temples visited:
మల్లేశ్వరం, బెంగళూరు - 12th Nov
కాడు మల్లిఖార్జున స్వామి - 5:30 pm
లక్ష్మీ నారసింహ స్వామి - 6 pm
గంగమ్మ ఆలయం - 6:30 pm
నంది క్షేత్రం - 7 pm
Malleswaram Mallayya🙏🙏
ReplyDelete