పంచభూత శివాలయాలు

కార్తీకం మొదలవుతూనే శివయ్యని దర్శించుకోవాలని కొన్ని నెలలుగా వేచి ఉన్నాం.  దీపావళి అవుతూనే, అర్ధరాత్రి లేచి రైలు ఎక్కేసాం.  తిరుచిరాపల్లి లో దిగి, జంబుకేశ్వర స్వామి (జల లింగం) దర్శనం చేసుకొని  పంచ భూత శివాలయాల యాత్రకు ఆరంభం చేసాం. అక్కడినుంచి శ్రీరంగంలో రంగనాథ స్వామి విరాట్ రూపాన్ని కళ్లారా దర్శించి, సాయంత్రం పుండరీకాక్షుని సన్నిధికి వెళ్లాం. అద్భుతమైన ఆలయాన్ని, అయ్యవారి అందాన్ని చూస్తూ పరవశించిపోయాం.  రాత్రి మళ్ళీ జంబుకేశ్వర స్వామి సన్నిధిలో గడిపి, శ్రీరంగంలోనే బస చేసాం.

తెల్లారి లేస్తూనే, చిదంబరానికి బయలుదేరాం.  త్రోవలో వైద్యనాధేశ్వరుని దర్శించుకొని, నటరాజ సన్నిధికి (ఆకాశ లింగం) చేరుకున్నాం.  అక్కడే చాలాసేపు అయ్యోరిని, అమ్మోరిని చూస్తూ గడిపేసాం.  అక్కడ పార్వతీదేవి పేరు ఏంటో తెలుసా, శివకామసుందరి - ఎంత అందమైన పేరు !!! ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక దివ్యదేశం కూడా ఉంది.  విష్ణుమూర్తి కూడా చక్కని దర్శనం ప్రసాదించారు.

సాయంత్రానికి అరుణాచలం చేరుకున్నాం.  అరుణాచలేశ్వరుని (అగ్ని లింగం) దర్శనం పూర్వజన్మ పుణ్య ఫలం.  మానవ జీవితం "అరుణాచల దర్శనానికి ముందు, తరువాత" అని రెండు రకాలుగా చూస్తారంట.  స్వామి గర్భాలయంలో వేడిని ఆనందంగా అనుభవించాం.  అక్కడినుంచి అరుణాచలం గిరి చుట్టూ ఉన్న దిక్పాలక ప్రతిష్ఠితాలైన శివాలయాలన్నీ చూసి తరించాం. రాత్రి అరుణాచలం లో బస.

ఉదయాన్నే కాంచీపురానికి ప్రయాణం.  ఏకాంబరేశ్వరుని (పృథ్వీ లింగం) దర్శనం ఒక అద్భుతం.  అదృష్టం కొద్దీ ఎంత రద్దీగా ఉన్నా, కాసేపు స్వామివారికి దగ్గరగా నిల్చోగలిగే అవకాశం దక్కింది.  ఈ ఆలయం లోనే ఇంకొక దివ్యదేశం, ఇంకొక చక్కని విష్ణుమూర్తి దర్శనం.  అక్కడి నుంచి, కామాక్షి అమ్మవారి దగ్గరకి వెళ్లాం.  శక్తిపీఠంలో, అమ్మవారి అభిషేక దర్శనం చూడగలిగిన ఈ కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయి కదా !!! అమ్మ వారి ఆలయం లోపల, ఒక దివ్యదేశం ఉంది, కానీ అద్దంలో మాత్రమే చూడగలం.  అలా అద్దంలో విష్ణుమూర్తిని చూసి ఆనందించాం.

రాత్రికి శ్రీకాళహస్తి చేరుకున్నాం.  తెల్లవారుఝామున కాళహస్తీశ్వర స్వామి (వాయు లింగం) దర్శనానికి వెళ్లిన మాకు అదృష్టం తోడై, అనిర్వచనీయమైన ఆనందం దొరికేలా అద్భుతమైన దర్శనం ప్రసాదించారు స్వామి.  ఆయన మాత్రమేనా, నేను మాత్రం వరమియ్యలేనా అన్నట్లుగా, జ్ఞాన ప్రసూనాంబ దేవి కూడా కరుణించింది.  జీవితాంతం నెమరువేసుకోగలిగే జ్ఞాపకాలు ఇచ్చారు, పార్వతీ పరమేశ్వరులు.   శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్న గుడిమల్లం లో వేంచేసిఉన్న పరశురామేశ్వర స్వామిని దర్శించుకొని పరవశించిపోయాం.  ఇట్టే గడిచిపోయిన కాలం, ఎన్నేళ్లు గడిచినా మరపురాని జ్ఞాపకాలు, ఇంకాసేపు స్వామి సన్నిధి లో గడిపితే బాగుండేది అనే అత్యాశ - వెరసి అందమైన నాలుగు రోజులు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి.  చివరకి, స్వామిని చూస్తూ మరిచిపోయిన ప్రపంచం లోకి తిరిగి వచ్చేసాం.

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి ఎదురుచూపులు - ఒక తియ్యని జ్ఞాపకం...


Temples visited:
జంబుకేశ్వర స్వామి - తిరుచిరాపల్లి (Thiruvanaikaval) - 8th Nov 10AM
రంగనాథ స్వామి - శ్రీరంగం - 2 PM
పుండరీకాక్ష పెరుమాళ్ - Thiruvellarai - 5 PM
వైద్యనాథేశ్వర స్వామి - Pullirukkuvelur9th 8AM
నటరాజ స్వామి - 11AM
గోవిందరాజ పెరుమాళ్ - 11:30AM
అరుణాచలేశ్వర స్వామి - Tiruvannamalai - 7PM
అష్ట దిక్పాలక ప్రతిష్ఠిత అష్ట శివాలయాలు (అరుణాచల గిరి వలయం) - 10PM
ఏకాంబరేశ్వర స్వామి - కాంచీపురం - 10th 10AM
దివ్య దేశం - 10:30 AM
కంచి కామాక్షి - కాంచీపురం - 11AM
వరదరాజ పెరుమాళ్ -  విష్ణు కంచి - 11:30AM
శ్రీకాళహస్తీశ్వర స్వామి - శ్రీకాళహస్తి - 11th 4AM
పరశురామేశ్వర స్వామి - గుడిమల్లం - 10AM

Comments

  1. Aa sivayya aaseervachanamulu Mee kutumbam maada vundaalani aasistu...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం