పంచారామాలు - అష్టసోమేశ్వరాలు
మా అమ్మ-నాన్న చాలా ఏళ్లుగా చూసిన ఎదురుచూపులు, ఈ ఏడాది ఫలించాయి. పంచారామాలు ఒకే రోజు చూడాలన్న వాళ్ళ కోరిక ఆ భగవంతుడు ఇన్నాళ్లకు తీర్చాడు.
ఉదయాన్నే గుంటూరు నుంచి అమరావతి చేరుకున్న మాకు, మైకు లో "అభిషేకం మొదలవుతోంది, అభిషేక దర్శనం చూడాలనుకునే భక్తులు తొందరగా రండి" అంటూ వినబడింది. అమరేశ్వర స్వామికి (ఇంద్ర ప్రతిష్ఠితం) నమక చమకాలతో అభిషేకం చేస్తూ ఉంటే, గుడ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయాం. ఎంత బాగుందో, కళ్ళకి ఎంత సంబరమో. అమరావతి ఉంచి భీమవరం చేరుకున్న మాకు, సోమేశ్వర స్వామి (చంద్ర ప్రతిష్ఠితం) చక్కటి దర్శనం ఇచ్చారు. ఎందుకో తెలియదుగానీ, ఎక్కువ భక్తులు లేరు. మాకు స్వామి సన్నిధి లో ఎక్కువసేపు ఉండే అవకాశం దక్కింది. అక్కడినుంచి పాలకొల్లు వెళ్లాం, క్షీరా రామలింగేశ్వర స్వామిని (విష్ణు ప్రతిష్ఠితం) చక్కగా దర్శించుకున్నాం. కొప్పు రామలింగేశ్వరుని కొప్పు చక్కగా కనబడింది సుమా. తరువాత మజిలీ, సామర్లకోట. చాళుక్య కుమారా రామ భీమేశ్వర స్వామిని (కుమారస్వామి ప్రతిష్ఠితం) చూసి తరించాం. చివరగా దక్షారామం వెళ్లిన మాకు భీమేశ్వర స్వామి (సూర్య ప్రతిష్ఠితం) దర్శనం చక్కగా అయింది. మాణిక్యాంబ అమ్మవారి దర్శనం అద్భుతం - శక్తిపీఠం లో ఇంత దగ్గరగా దర్శనం దొరకడం, అందులోనీ కార్తీక మాసంలో, మాటలు కాదు కదా !!! రాత్రి దక్షారామంలో బస.
తెల్లవారు ఝామునే బయలుదేరి, మండపేట చేరుకున్న మాకు అగస్త్యేశ్వర స్వామి దర్శనం చక్కగా అయింది. అక్కడ నుంచి ర్యాలీ వెళ్లి ఉమా కమండలేశ్వర స్వామిని దర్శించుకున్నాం, రుద్రాక్ష మాదిరిగా ఉన్న శివయ్య చక్కగా అగుపించారు. తరువాత, జగన్మోహినీ కేశవస్వామి దర్శనం అత్యద్భుతంగా అయింది, ఆ శిలా నైపుణ్యం వర్ణించనలవి కాదు. స్వామిని ఎంత సేపు చూసినా తనివి తీరదు. అక్కడ నుంచి వాడపల్లి వెళ్లిన మాకు జన సందోహం చూసి ఆశ్చర్యం వేసింది, దర్శనం అవుతుందో లేదో అని భయం వేసింది కూడా. కానీ, అదృష్టం కొద్దీ, క్షణకాలం పాటు స్వామి దర్శనం దొరికింది, అదే పరమానందం. రాత్రి దక్షారామంలో బస.
తరువాత రోజు, అష్ట సోమేశ్వరాలు దర్శించుకున్నాం. దాక్షారామం సూర్య ప్రతిష్ఠితం కదా, ఆ వేడిని తగ్గించడానికి సోముడు , అష్ట దిక్కులా అష్ట సోమేశ్వరులను ప్రతిష్టించాడు. శివునితో పాటు కొన్ని ఆలయాల్లో, నవ జనార్దనులలో కొన్ని దర్శనాలు కూడా అయ్యాయి. సాయంత్రం సర్పవరంలో భావన్నారాయణ స్వామి ని దర్శించుకొని, తిరుగుప్రయాణమయ్యాము.
వాడపల్లి వేంకటేశ్వరుని సన్నిధి లో, జన సందోహంతో మేము కూడా !!!
Temples visited :
అమరారామము (అమరావతి, గుంటూరు జి||) - అమరేశ్వరుడు - 5:30 AM
భీమారామము (భీమవరం, ప||గో|| జిల్లా) - సోమేశ్వరుడు - 2 PM
క్షీరారామము (పాలకోల్లు, ప||గో|| జిల్లా) - రామలింగేశ్వరుడు - 3 PM
కుమారారామము (సామర్లకోట, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు - 6 PM
దక్షారామము (ద్రాక్షారామము, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు - 8 PM
మండపేట - అగస్త్యేశ్వర స్వామి - 7 AM
ర్యాలీ - ఉమా కమండలేశ్వర స్వామి - 10 AM
ర్యాలీ - జగన్మోహినీ కేశవస్వామి - 11 AM
వాడపల్లి - వేంకటేశ్వర స్వామి - 3 PM
ఈశాన్యం - పెనుమాళ్ల - సోమేశ్వర స్వామి - 7 AM
తూర్పు - కోలంక - సోమేశ్వర స్వామి - 7:30 AM
ఆగ్నేయం - దంగేరు - సోమేశ్వర స్వామి - 8:30 AM
ఉత్తరం - వెల్ల - సోమేశ్వర స్వామి - 9 AM
దక్షిణం - కోటిపల్లి - సోమేశ్వర స్వామి - 9:30 AM
వాయువ్యం - సోమేశ్వరం - సోమేశ్వర స్వామి - 11 AM
పడమర - వెంటూరు - సోమేశ్వర స్వామి - 11:30 AM
నైరుతి - కోరుమిల్లి - సోమేశ్వర స్వామి - 12:30 PM

Comments
Post a Comment