Posts

Showing posts from 2019

మదురై - రామేశ్వరం

Image
ఏమి నా భాగ్యం.. గత ఏడాదినుంచి ఎన్నోసార్లు వెళ్లాలని ప్రణాళికలు కూడా వేసుకున్నా, కుదరక వెళ్లలేకపోయిన అద్భుత ఆలయమాలల  సందర్శనాభాగ్యం ఎట్టకేలకు దొరికింది.  ఎన్ని క్షేత్రాలు, ఎన్ని అద్భుత దర్శనాలు, ఎంత ఆనందం, ఏమి పారవశ్యం !!!   మదురై  మరియు  రామేశ్వరం  - రెండు ప్రదేశాలలో శివయ్య రెండు చేతులతో హత్తుకొని లోనికి రమ్మని పిలిచినట్టు ఎంత చక్కటి దర్శనాలు !!! తిరుచెంగోడు లో స్వయంభూ గా వెలసిన అర్ధనారీశ్వర స్వామిని దర్శించుకున్నాం.  మార్గశిరమాసంలో ఉదయం 7 వరకూ, మరకతలింగ దర్శనం కూడా ఉంటుంది, అదృష్టవశాత్తూ ఆ దర్శన భాగ్యం కూడా దక్కింది.  ఇదే ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి కూడా స్వయంభూ గా వెలిసాడు.  ఆయనని కూడా చక్కగా దర్శించుకొని ప్రయాణం కొనసాగించాం.  మదురై దగ్గరలో అళగర్ కొండమీద ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం ఎంతో బాగుంది.  చక్కగా స్వామి ముందు రెండు నిముషాలు కూర్చోనిచ్చి పంపించారు.  ఇది 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటి.   దర్శనం చేసుకొని వచ్చేసరికి కొండ దిగువన ఉన్న పెరుమాళ్ ఆలయం తెరిచిల...

అయ్యప్ప దర్శనం

Image
 ఎన్నాళ్లకెన్నాళ్లకు ఈ వైభోగం !!!  ఎలా అయితేనేం, అయ్యప్ప స్వామి కొండకి వెళ్లి వచ్చాను.  స్వామిని కళ్లారా దర్శించుకోగలిగాను.  విపరీతమైన రద్దీలో కూడా ప్రశాంతమైన దర్శనం ప్రసాదించాడు, ఆ హరిహర పుత్రుడు.  ఇన్ని రోజులకు దొరికిన అదృష్టం కొద్దీ, శబరిమల ఎక్కుతూ శరణుఘోష వినగలిగాను.  అంత పెద్ద కొండపై, ఇంకా పెద్ద గుడిలో, చిన్ని విగ్రహం ఇంకా కళ్ళ ముందే ఉంది సుమా.  ఇంతమంది స్వామిమాల ఎందుకు వేసుకుంటారు, ఇంత కఠినమైన నియమాలని ఎలా పాటిస్తారు, నఖ-శిఖ పర్యంతం పవిత్రతని ఎలా కాపాడుకుంటారు, మనసుకి మలినాలు అంటకుండా ఎలా మండలదీక్ష చేస్తారు - ఇలా ఎన్నో ప్రశ్నలు నా మనసులో ఎప్పటినుంచో రగులుతున్నవే.  అదేమిటో విచిత్రం, అన్నిటికీ సమాధానం మాత్రం, అయ్యప్పని దర్శనంతో దొరికినట్టే అనిపించింది.  స్వామిని తన్మయత్వంతో ఆపాదమస్తకం కళ్ళతో జుర్రేస్తూ ఉంటే, ఎవరో భక్తుడు విసిరిన మొక్కుబడి మూట, నా ముక్కుకి తగిలి వాచింది.  "ఇన్నాళ్లు రాకుండా ఆలస్యం చేసావేం రా" అని స్వామి ముద్దుగా మందలించాడేమో. ఉదయాన్నే,  చంగనూరు లో రైలు దిగి, పంబ వరకూ బస్సులో వెళ్లాం.  అక్కడ ...

నివేదనలు - ప్రసాదములు

నివేదనలు 1) చూతఫలం= మామిడిపండు  2) ఖర్జూర= ఖర్జూరం.             3) నింబ= వేప 4) నారింగ= నారింజ 5) భల్లాతకీ= జీడిపప్పు 6) బదరీ= రేగు 7) అమలక= ఉసిరికాయ 8) శుష్కద్రాక్ష= కిస్మిస్ 9) అమృత లేక బీజాపూరం=  జామపండు 10) ఇక్షుఖండం= చెఱకుముక్క 11) కదళీఫలం, రంభా ఫలం= అరటిపండు 12) నారికేళం= కొబ్బరికాయ 13) జంభీర= నిమ్మ పండు 14) దాడిమీ= దానిమ్మపండు 15) సీతాఫలం= సీతాఫలం 16) రామఫలం= రామఫలము 17) కపిత్త= వెలగ పండు 18) శ్రీ ఫలం, బిల్వఫలం= మారేడు 19) మాదీ ఫలం= మారేడు పండ్లు 20) జంభూఫలం= నేరేడు 21) వాతాదం= బాదము పప్పు ప్రసాదములు 1) కుశలాన్నం = పులగం 2) చిత్రాన్నం= పులిహోర 3) క్షీరాన్నం= పరమాన్నం 4) పాయసం= పాయసం 5) శర్కరాన్నం= చక్కెరపొంగలి 6) మరీచ్యన్నమ్= కట్టు లేదా మిరియాల పొంగలి 7) దధ్యోదనం= పెరుగు అన్నము 8) తిలాన్నం= నువ్వులపొడితో చేసిన అన్నం 9) శాకమిశ్రితాన్నం= కిచిడీ 10) గుడాన్నం = బెల్లపు పరమాన్నం 11) సపాదభక్ష్యం= గోధుమనూకతో చేసిన ప్రసాదం  (గోధుమ నూక పంచదార నెయ్యి సమపాళ్ళలో వేసి చేసింది గాన ఆపేరు) 12) గుడమిశ్రిత ముద్గ సూపమ్= వడపప్పు 13) ...

యమదూత వర్తమానం

శ్మశానానికి వెళ్ళి  కాలుతున్న శవాలను అడిగా.. ఎక్కడకి వెళుతున్నారు మీరు అని?? ఏమో తెలీదు అయినా నువ్వెవరు ప్రాణాలతో శ్మశానానికి ఎందుకొచ్చావ్ ,ఎలా వచ్చావ్,ఇంత అర్థరాత్రి, అని అడిగింది కాలుతున్న ఓ శవం.. నేను కొన్ని రోజులనుండి  మానసిక సంఘర్షణకు లోనౌతున్నా మనం ఎవరం ,ఎందుకు పుడుతున్నాం ఎందుకు చచ్చిపోతున్నాం మనవెంట ఏం వస్తుంది?,... అని మాట పూర్తవకుండానే నా మాటకి అడ్డొచ్చింది ఆ శవం, పిచ్చివాడా అవి అందరికీ వచ్చే,ప్రశ్నలే,ప్రతీ హృదయంలో  జరిగే సంఘర్షణే..ఆ మాటకొస్తే నామటుకునాకు చాలాసార్లు వచ్చింది.కాని ఎవరికైనా తెలిస్తే నవ్వుతారేమో అని ఎవరికి చెప్పకుండా ఇక్కడే ఉంటాం ఇదంతా మనదే అని,అణా కూడా దానం చేయకుండా, చాలా ధనం కూడబెట్టా,కొంత భూములు తవ్వికూడా దాచుకున్నా వాటిని తగ్గలెయ్యా నేను తగలబడిపోతున్నా రావట్లేదే???ఇందాకణ్ణించీ అదే ఆలోచిస్తున్నా.. సరే నువ్వేం చేసావో చెప్పు.. మళ్ళీ నేను చెప్పడం ఆరంభించా.. అలా మానసిక సంఘర్షణతో ఉండలేక అందర్ని అడగడం మొదలెట్టా ఎవ్వరూ చెప్పలేదు సరికదా కొంతమంది తిట్టారు,కొంతమంది కొట్టడానికొచ్చారు,కొంతమంది పిచ్చోడన్నారు..కొంతమందైతే సంపాదించడం చేతకాకే ఇలాంటివి ఆల...

కనకధారా స్తోత్రం - అర్థం

Image
శ్లో॥ అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ । అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా: ॥2 తాత్పర్యము : ఆఁడు తుమ్మెద నల్లని తమాల వృక్షముపై వాలినట్లుగా ఏ మంగళదేవత యొక్క ఓరచూపు నీలమేఘశ్యాముఁడైన భగవాన్ విష్ణుమూర్తిపై ప్రసరించినప్పుడు ఆ వృక్షము తొడిగిన మొగ్గలవలె ఆయన శరీరముపై పులకాంకురములు పొడమినవో, అష్టసిద్ధులను వశీకరించుకొన్న ఆ శ్రీ మహాలక్ష్మీ భగవతి యొక్క కృపా కటాక్షము నాకు సమస్త సన్మంగళములను సంతరించును గాక ! శ్లో॥ ముగ్ధా ముహుర్ విదధతీ వదనే మురారే: ప్రేమ ప్రపాత ప్రణిహితాని గతాగతాని । మాలా దృశోర్ మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయా: ॥3 తాత్పర్యము : ఒక పెద్ద కమలము చుట్టుత ఆగి-ఆగి పరిభ్రమించు తుమ్మెద వలె విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువలెత్తిన ప్రేమను మాటిమాటికిని ప్రసరింపజేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదల ననుగ్రహించు గాక ! శ్లో॥ విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్షమ్ ఆనంద కంద మనిమేష మనంగ తంత్రమ్ । ఆకేకర స్థిర కనీనిక పద్మనేత్రమ్ భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయా: ॥4 తాత్పర్యము : తనను భజించువారికి దేవేంద్ర పదవిని సైతమివ్వజ...

ఏడుజన్మల దెప్ప

Image
!! యేజన్మకాజన్మ భవసాగరాలయం ఏడుజన్మల దెప్ప ఈశ్వరుండే దారి !! !! యేరూపమై నుండో పైనుండి బ్రాణము మాయ గర్భములోకి జీవకణమైవచ్చు పేగుబంధముతో పెనసి మలమూత్రముల ప్రాణవాయువు దాకిడి ప్రపంచపుజూపు !! !! గతకర్మములెల్ల గతుల బంధాలైమలసి పాపపుణ్యపు జీవితము ఋణసంబంధము తెగని అరిషడ్వర్గాల అలరు జీవనము దైవంబు దలపులో మరపులోన బెట్టి !! !! చింతాజన్మము భవదురిత జన్మము యెకడను ఈశుండే దిక్కైన దిక్కుగను అన్నిదిక్కులవాడు అలరి భజియించు జన్మకేలే కైలాస పరమపధయోగము !! రచన నరేషాచారి

పంచారామాలు

పవిత్ర లింగాలు... పంచారామాలు శివకేశవులకి భేదం లేదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుడు ఎక్కడ ఉంటాడో విష్ణువు అక్కడే ఉంటాడు. విష్ణువు ఉన్నచోటే శివుడూ కొలువవుతా...

ద్వాదశ నామ స్తోత్రాలు

1.శ్రీ నారసింహ ద్వాదశ నామ స్తోత్రం..!💐 ప్రథమం వజ్రదంష్ట్రంశ్చ ద్వితీయం నరకేసరి తృతీయం జ్వాలామాలాంశ్చ చతుర్ధం యోగిపుంగవం పంచమం ధ్యానమగ్నంచ షష్ఠం దైత్యవిమర్దనం సప్తమం వేదవేద్యంచ అగ్నిజిహ్వం తధాష్టమం నవమం మంత్రరాజంచ దశమం భయభంజనం ఏకాదశం ప్రహ్లాదవరదంచ ద్వాదశం తిమిరాపహం || సర్వం శ్రీ లక్ష్మీనారసింహచరణారవిందార్పణమస్తు 2.శ్రీ గణపతి ద్వాదశ నామ స్తోత్రం..!💐 ప్రథమం ఏకదంతంచ ద్వితీయం షణ్ముఖాగ్రజం తృతీయం అనింద్యారూఢంచ చతుర్ధం మోదకప్రియం పంచమం ఆద్యపూజ్యంచ షష్ఠం విఘ్ననివారకం సప్తమం వేదవేద్యం చ అష్టమం స్ఫూర్తిదాయకం నవమం కవిరాజం చ దశమం నాట్యకౌశలం ఏకాదశం గణనాథం చ ద్వాదశం శూర్పకర్ణకం || సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. 3.శ్రీ ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం..!💐 ప్రథమం ఆంజనేయంచ ద్వితీయం లంకనాశనం తృతీయం రామభక్తంచ చతుర్ధం యోగిపుంగవం పంచమం కార్యదీక్షంచ షష్ఠం వాక్యవిశారదం సప్తమం ధ్యానమగ్నంచ అష్టమం బుద్ధికౌశలం నవమం సురవంద్యంచ దశమం భానుతేజసం ఏకాదశం మిత్రశిష్యంచ ద్వాదశం భక్తకామదం || సర్వం శ్రీ ఆంజనేయ చరణారవిందార్పణమస్తు. 4.శ్రీ సుబ్రహ్మణ్య ద్వాదశ నామ స్తో...