ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. అని మనసు పాడుతూ ఉంటే, శ్రీకాళహస్తికి బయలుదేరాం. త్రోవలో ఉన్న కొన్ని అద్భుతమైన ఆలయాలు దర్శించుకుంటూ వెళ్ళాం. మొట్టమొదట విఘ్నేశ్వరుని దివ్య దర్శనం. పక్కనే కౌండిన్య మహర్షి ప్రతిష్టించిన సోమేశ్వరుని కూడా దర్శించుకున్నాం. గరుడ ఆలయ దర్శనం చాలా బాగుంది. ఎక్కడా ఇతః పూర్వం వినలేదు, కనలేదు. అక్కడినుంచి ముళబాగిలు లో ఉన్న 10 అడుగుల అద్భుతమైన ఆంజనేయుని కళ్లారా చూసుకొని పలమనేరు బయలుదేరాం. శ్రీకూర్మం, బళ్లారి తరువాత కూర్మావతారానికి ఆలయం పలమనేరు దగ్గర మాత్రమే ఉంది. స్వామిని చక్కగా దర్శించుకున్నాం. కాణిపాకం చాలా ఏళ్ళ తరువాత వెళ్ళాం, చక్కని దర్శనం దొరికింది. అగస్త్యేశ్వర స్వామి ఆలయం అపూర్వమైనది, అగస్త్యునికి స్వర్ణముఖి నదిలో దొరికిన అద్భుత లింగం, వెంకటేశ్వర స్వామి పద్మావతీ సమేతుడై వచ్చి కొలిచిన లింగం. శ్రీకాళహస్తిలో రాత్రి బస. మరునాడు తెల్లవారిఝామునే, జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామిని కనులపండుగగా దర్శించుకొన్నాం. తొండమాన్ చక్రవర్తి కోరిక మేరకు, ఆయన కోసం, దేవేరు...