శివుడోయమ్మా... శివుడూ

శివుడోయమ్మా...  శివుడూ... 
సాంబశివుడు... సదాశివుడూ... 

దోసెడు నీళ్ల కు దొరుకును... 
కష్టాలు కన్నీళ్లు తీర్చునూ... 
చిటికెడు బూడిద రాసినా ఒప్పునూ...
రాతలు గీతలు మార్చునూ...   || శివుడోయమ్మా... శివుడూ || 

పత్రమైనా చాలునూ... 
ఫలితం తప్పక దొరుకునూ...
గుండె గుడిలో ఒదుగునూ...
గౌరి తో కొలువుతీరునూ...  || శివుడోయమ్మా... శివుడూ || 

నమ్మినవారికి దైవమూ...
సర్వజీవులలో ప్రాణమూ...
నాలో నీలో జీవమూ...   
నాది  అను అహమిక అంతమూ...  || శివుడోయమ్మా... శివుడూ || 


Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం