చైతన్యం

హృదయకమలంలో
సూది మొనంత
చైతన్యం జీవుడు
అండ పిండ బ్రహ్మండాలలో 
సర్వర్త్రా నిండివున్న
చైతన్యం శివుడు
జీవ చైతన్యం
పరమాత్మ చైతన్యంలో కలిపే
యాత్ర
జనన మరణ చక్రము
జీవచైతన్యం
లక్ష్యం జనన మరణ
చక్రాన్ని అధికమించి
పరమాత్మ చైతన్యంలో
విలీనమవ్వటం
జీవుని చైతన్య
స్థాయిని బట్టి
యోగము, సాధన
జ్ఞానము తో కూడిన
మార్గములెన్నో ఉన్నా
భక్తి మార్గము అత్యుత్తమమై
అత్యల్పమైన చైతన్యము
కలిగిన జీవిని
సులువుగా గమ్యాన్ని
చేరుస్తుంది
జ్ఞానానికి
ఈశ్వర తత్వము అందకపోవచ్చు
కానీ
మూఢ భక్తికి దాసుడు
ఆ పశుపతి ..
దానికి ఎన్నో ఉదాహరణలు
ఆళ్వార్లు నయనార్ల చరిత్రలు
భక్తి సోపానం
ఆద్యంతమూ అద్భుతాలతో
సాగుతుంది
తనని తాను మరచి
త్రికరణ శుద్ధిగా
సమర్పణ చేసుకున్న
జీవ చైతన్యం
పరమాత్మ చైతన్యంలో
భాగమవుతుంది
శివోహం

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం